Tuesday, 21 September 2021

Kalasaapuramu kaada - Annamacharya Keerthana

Raagam: Vasanthi

Thaalam: Aadi


కలశాపురము కాడ కందువ సేసుకొని

అలరుచున్నవాడు హనుమంతరాయడు

సహజాన నొకజంగ చాచి సముద్రము దాటి
మహిమ మీరగ హనుమంతరాయడు
ఇహమున రాము బంటై యిప్పుడు నున్నవాడు
అహరహమును దొడ్డ హనుమంతరాయడు

నిండు నిధానపు లంక నిమిషాన నీరుసేసె
మండిత మూరితి హనుమంతరాయడు
దండితో మగిడి వచ్చి తగ సీత శిరోమణి
అండ రఘుపతి కిచ్చె హనుమంతరాయడు

వదలని ప్రతాపాన వాయుదేవు సుతుడై
మదియించి నాడు హనుమంతరాయడు
చెదరక యేప్రొద్దు శ్రీవేంకటేశు వాకిట
అదివో కాచుకున్నాడు హనుమంతరాయడు

No comments:

Post a Comment