Raagam: Hindola Vasantham
Thaalam: Aadi thaalam (Trisra gathi)
ప) మూడే మాటలు మూఁడుమూండ్లు తొమ్మిది
వేడుకొని చదువరో వేదాంతరహస్యము
1) జీవస్వరూపము చింతించి యంతటాను
దేవుని వైభవము తెలిసి
భావించి ప్రకృతిసంపద యిది యెఱుఁగుటే
వేవేలువిధముల వేదాంతరహస్యము
2) తనలోని జ్ఞానము తప్పకుండాఁ దలపోసి
పనితోడ నందువల్ల భక్తినిలిపి
మనికిగా వైరాగ్యము మఱవకుండుటే
వినవలసినయట్టి వేదాంతరహస్యము
3) వేడుకతో నాచార్య విశ్వాసము గలిగి
జాడల శరణాగతి సాధనముతో
కూడి శ్రీవేంకటేశ్వరుఁగొలిచి దాసుఁడౌటే
వీడని బ్రహ్మానంద వేదాంతరహస్యము
Pa) Moodey maatalu moodu moondlu thommidi
Vedukoni chaduvaro vedaantha rahasyamu
1) Jeeva swaroopamu chinthinchi anthataanu
Devuni vaibhavamu thelisi
Bhaavinchi prakruthi sampada idi erugutey
Vevelu vidhamula vedaantha rahasyamu
2) Thanaloni gnyaanamu thappakundaa thalaposi
Pani thodananduvalla bhakthi nilipi
Manikigaa vairaagyamu maravakundutey
Vinavalasinayatti vedaantha rahasyamu
3) Vedukathonaachaarya viswaasamu galigi
Jaadala saranaagathi saadhanamutho
Koodi Sri Venkateswaru golichi daasudoutey
Veedani brahmaananda vedaantha rahasyamu
No comments:
Post a Comment