Thursday, 2 December 2021

Narayana nee naamamey gathi - Annamacharya Keerthana




Raagam: Hindolam

Thaalam: Aadi


Pa) Narayana nee naamamey gathi ika

Korikalu maaku konasaagutaku


1) Paipai mundata bhava jaladhi
Daapu venuka chinthaa jaladhi
Chaapalamu naduma samsaara jaladhi
Thaepa edi idi theganeedutaku

2) pandenu edama paapapu raasi
Andanu kudini punyapu raasi
Kondanu naduma triguna raasi
Ninda kuduchutaku nilukada edi

3) kindi lokamulu keedu narakamulu
Andeti swargaalavey meeda
Chendi antharaathma Sri Venkatesa nee
Yandey paramapadamavala 



ప) నారాయణా నీ నామమే గతి యిక

కోరికలు మాకు కొనసాగుటకు


1) పైపై ముందట భవజలధి

దాపు వెనుక చింతా జలధి

చాపలము నడుమ సంసార జలధి

తేపయేది యిది తెగనీదుటకు


2) పండెను ఎడమ పాపపు రాశి

అండను కుడిని పుణ్యపు రాశి

కొండను నడుమ త్రిగుణ రాశి

నిండ కుడుచుటకు నిలుకడ యేది


3) కింది లోకములు కీడు నరకములు

అందెటి స్వర్గాలవే మీద

చెంది యంతరాత్మ శ్రీ వేంకటేశ నీ

యందె పరమపద మవల మరేది

No comments:

Post a Comment