ప) చైతన్యానికి సంకేతం - చైత్ర మాసమా, స్వాగతం
జైత్రయాత్రలో జాగృతమయ్యే జాతికిదే శుభ సంగీతం
సతతం హరితం సుమ సుచరితం
శుక పిక కలరవ సుమధుర గీతం
వత్సరాది కథనం, మది మరువరాని చరితం
ఇది వత్సరాది కథనం, మది మరువరాని చరితం
1. శకస్థాపకుడు శాలివాహనుడు విజయధ్వజుడిగా వెలిగిన చిహ్నం
రావణు గెలిచిన రాఘవాన్వయుడు సీతతోడి దీపించిన వైనం
వజ్ర కరుణతో వసు రాజేశుడు వరబలుడై వర్ధిల్లిన చిత్రం
విధాత సృష్టికి శుభాది ఘట్టం - శుక్ల పాడ్యమికి ఉగాది పట్టం
2. ఇంటి ముంగిటను ఇంద్రధ్వజమును ఇంపుగ నిలిపే ఆచారం
తలంటి స్నానం, కొత్త దుస్తులు తరాల సంస్కృతి ఆధారం
చేదు, పులుపు, తీపి, వగరు, కారం, క్షారం కలిసిన పచ్చడి
ఉగాది పండుగ ప్రత్యేకం - చేయును జీవిత వ్యాఖ్యానం.
బంధుమిత్రులతో సపరివారముగ షడ్రస భోజన సంతోషం
తప్పక వినవలె పంచాంగం
Pa) Chaitanyaaniki sanketham - Chaithra maasamaa swaagatham
Jaithra yaathralo jaagruthamayye jaathikidey subha sangeetham
Sathatham haritham suma sucharitham
Suka pika kalarava sumadhura geetham
Vathsaraadi kathanam, madi maruvaraani charitham
Idi vathsaraadi kathanam, madi maruvaraani charitham
1. Saka sthaapakudu Saalivaahanudu vijaya dhwajudigaa veligina chihnam
Raavanu gelichina Raaghavaanvayudu Seetha thodi deepinchina vainam
Vajra karunatho Vasu raajesudu varabaludai vardhillina chithram
Vidhaatha srushtiki subhaadi ghattam - Sukla paadyamiki Ugaadi pattam
2. Inti mungitanu Indra dhwajamunu impuga nilipey aachaaram
Thalanti snaanam, kottha dusthulu tharaala samskrithi aadhaaram
Chedu, pulupu, theepi, vagaru, kaaram, kshaaram kalisina pacchadi
Ugaadi panduga prathyekam - Cheyunu jeevitha vyaakhyaanam
Bandhu mithrulatho saparivaaramuga shadrasa bhojana santhsham
Thappaka vinavale panchaangam
No comments:
Post a Comment