శశిముఖులారా రండి
మన పసిపాపలకు భోగిపండ్లు పోయగ వేగ
రేగుపండ్లు పూలు కాసులు దిగబోసి
గారాల పాపలకు రాగాలతో మీరు
ముత్తయిదువులందరూ మురిపాల లాలింప
శతమానం అని దేవీదేవతలు దీవింప
కళకళలాడుచు కాంతలందరు మీరు
పలుకుల చిలుకలు పసిబాలలు మీరు
కర్పూరహారతిని కన్నులకద్దించి
సంక్రాంతి శుభవేళ భాగ్యాల దీవింప
మంచుతెరల సొబగు భోగిమంటల వెలుగు
కడిగిన లోగిళ్ళ కనక వర్షము కురియ
గంగిరెద్దులవారు దీవెనలు పాడంగ
హరిదాసులు రామనామమును వినిపింప
పసుపుకుంకుమలుంచి గొబ్బెమ్మల సవరించి
గొబ్బి కట్టుచు బాలలు గౌరిని సేవింప
వాయనములందుకొని వావివరుసలవారు
పేరంటమునకు పేరుపేరున వచ్చి
No comments:
Post a Comment