Sunday, 2 February 2025

Vandemataram - Telugu Patriotic Song - Anupama Yeluripati


 

వందేమాతరం


పారే ఝరుల గలగలగలలే 

ఊగే పైరుల మిలమిలమిలలే

విరబూసే విరుల కిలకిలకిలలే

తలలూపే తరుల గుసగుసగుసలే

తెలిపేనే నీ అందం

నీ చల్లని చూపుల హాయిని పొందిన చందం


వందేమాతరం


నలుదిశలను కన జనజనరీతులు విధవిధవిధములులే

పలుకులు విన మరి బహుబహుభాషలు అతిఅతి మధురములే

మలయాచల మారుత శీతల పరిమళ మహిమలదీ చలవే

ఇక నవరస మిళితము షడ్రుచి సహితము నీ సుత స్థితిగతులే


వందేమాతరం


Vandemataram


Paarey jharula galagalagalaley

Oogey pairula milamilamilaley

Viraboosey virula kilakilakilaley

Thalaloopey tharula gusagusagusaley

Thelipeney nee andam

Nee challani choopula haayini pondina chandam


Vandemataram


Nalu disalanu kana janajana reethulu vidhavidhamulaley

Palukulu vina mari bahubahu bhaashalu athi athi madhuramuley

Malayaachala maarutha seethala parimala

mahimaladee chalavey

Ika navarasa milithamu shadruchi sahithamu

nee sutha sthithi gathuley


Vandemataram


No comments:

Post a Comment