Lyrics: శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ
తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా
భావం భాగ్యం కూర్చుకొని సుఖ జీవన యానమే చేయుదమా
సాగర మేఖల చుట్టుకొని - సుర గంగ చీరగా మలచుకొని
గీతాగానం పాడుకొనే మన దేవికి ఇవ్వాలి హారతులు
గాంగ జటాధర భావనతో - హిమ శైల శిఖరమే నిలబడగా
గలగల పారే నదులన్నీ ఒక బృందగానమే చేస్తుంటే
ఎందరో వీరుల త్యాగఫలం మన - నేటి స్వేఛ్ఛకే మూలబలం
వారందరినీ తలచుకొని మన - మానస వీధిని నిలుపుకొని
Thenela thetala maatalatho
Mana desa maathaney kolichedamaa
Bhaavam bhaagyam koorchukoni - sukha
jeevana yaanamey cheyudamaa
Saagara mekhala chuttukoni- sura
Ganga cheeragaa malachukoni
Geethaa gaanam paadukoney - mana
Deviki ivvaali haarathulu
Gaanga jataadhara bhaavanatho - Hima
saila sikharamey nilabadagaa
galagala paarey nadulannee -oka
brundagaanamey chesthuntey
Endaro veerula thyaagaphalam
Mana neti svecchakey moolabalam
Vaarandarinee thalachukoni - mana
maanasa veedhini nilupukoni
No comments:
Post a Comment