Lyrics: శ్రీ దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి
ఈ భారత భువి పొంగెను ముక్త జీవధార
లేవోయ్ లేలేవోయ్, మ్రోగేను నగారా
పొంగె జీవధార, అది ముక్త జీవధార
చిరదాస్యం పొరపాటు, పర ప్రభుత్వ దొంగవ్రేటు
లేవోయ్ లేలేవోయ్, మ్రోగేను నగారా
నీ శీర్షం హిమశృంగం, నీ ఎద గంగాభంగం
నీ దేశం నీదే నీ భారతదేశం
మన భారతదేశం, ప్రజలందరి కోసం
లేవోయ్ లేలేవోయ్, మ్రోగేను నగారా
పొంగె జీవధార, అది ముక్త జీవధార
నైరాశ్యం పెనురోగం, వైరాగ్యం జడభోగం
లేవోయ్ లేలేవోయ్, మ్రోగేను నగారా
నీ మనస్సు సువిభాతం, నీ రక్తం జలపాతం
నీ దేశం నీదే నీ భారతదేశం
మన భారతదేశం, ప్రజలందరి కోసం
లేవోయ్ లేలేవోయ్, మ్రోగేను నగారా
పొంగె జీవధార, అది ముక్త జీవధార
మతభేదం చెడు తంత్రం, మగత నిద్ర ఒక మంత్రం
లేవోయ్ లేలేవోయ్, మ్రోగేను నగారా
నీ గతమ్ము మూలధనం, నీ భావి వసంతవనం
నీ దేశం నీదే నీ భారతదేశం
మన భారతదేశం, ప్రజలందరి కోసం
లేవోయ్ లేలేవోయ్, మ్రోగేను నగారా
పొంగె జీవధార, అది ముక్త జీవధార
Praabhaatha praanganaana mrogenu nagaaraa
Ee Bharatha bhuvi pongenu muktha jeevadhaara
Levoy lelevoy mrogenu nagaaraa
Ponge jeevadhaara, adi muktha jeevadhaara
Chiradaasyam porapaatu, para prabhuthva dongavretu
Levoy lelevoy mrogenu nagaaraa
Nee seersham hima srungam, nee eda Gangaa bhangam
Nee desam needey nee Bharatha desam
mana Bharatha desam, prajalandari kosam
Levoy lelevoy mrogenu nagaaraa
Ponge jeevadhaara, adi muktha jeevadhaara
Nairaasyam penurogam, vairaagyam jada bhogam
Levoy lelevoy mrogenu nagaaraa
Nee manassu suvibhaatham, nee raktham jalapaatham
Nee desam needey nee Bharatha desam
mana Bharatha desam, prajalandari kosam
Levoy lelevoy mrogenu nagaaraa
Ponge jeevadhaara, adi muktha jeevadhaara
Mathabhedam chedu thanthram, magatha nidra oka manthram
Levoy lelevoy mrogenu nagaaraa
Nee gathammu mooladhanam, nee bhaavi vasantha vanam
Nee desam needey nee Bharatha desam
mana Bharatha desam, prajalandari kosam
Levoy lelevoy mrogenu nagaaraa
Ponge jeevadhaara, adi muktha jeevadhaara
No comments:
Post a Comment