Tuesday, 4 August 2020

Viswa Bharatha veera levoyi - Telugu patriotic song


విశ్వభారత వీర లేవోయీ

ప్రగతి పథముల వెంట పదవోయీ

1) స్వాతంత్ర్య వీరుండు రాణా ప్రతాపుండు
నీ జాతి వాడురా ప్రళయాగ్ని నీవురా
వీరాభిమన్యుండు పలనాటి బాలుండు
నీ సహోదరులురా లయ ఝంఝ నీవురా

2) ధీర ఝాన్సీరాణి నీ వీరమాతరా
కాకతీ రుద్రమ్మ నీ సోదరేనురా
మగువ మాంచాల నీ బంగారు వదినరా
వీర వంశము నీది వీర రక్తమ్మురా

3) పదునాల్గు భువనాల నిన్నడ్డు మొనగాడు
లేడురా జగదేక వీరుడవు నీవెరా
శివ సముద్రమ్మువై బడబాగ్ని జ్వాలవై
లంఘించి దూకరా లోకాలనేలరా

Viswa Bharatha veera levoyi
Pragathi pathamula venta padavoyi

1) Swaathanthrya veerundu Rana Prathapundu
Nee jaathi vaaduraa pralayaagni neevuraa
Veerabhimanyundu palanaati baalundu
Nee sahodaruluraa laya jhanjha neevuraa

2) Dheera Jhansi Rani nee veera maatharaa
Kaakathee Rudramma nee sodarenuraa
Maguva Manchaala nee bangaaru vadinaraa
Veera vamsamu needi veera rakthammuraa

3) Padunaalgu bhuvanaala ninnaddu monagaadu
leduraa jagadeka veerudavu neeveraa
Siva samudrammuvai badabaagni jwaalavai
Langhinchi dookaraa lokaalanelaraa

No comments:

Post a Comment