Wednesday, 21 July 2021

Aakati velala - Annamacharya Keerthana

 Raagam: Subha Panthuvaraali-based

Thaalam: Aadi




Pa) Aakati velala alapaina velalanu
Thekuva Hari naamamey dikku mari ledu

1) Koramaali unna vela - kulamu chedina vela
Cheravadi orula chejikkina vela
Orapaina Hari naamamokkatey gathigaaga
Marachi thappinanaina mariledu theragu

2) Aapada vacchina vela - Aaradi padina vela
Paapapu vela - Bhayapadina vela
Opinantha Hari naamamokkatey gathigaaga
Maapu daaka boralina mariledu theragu

3) Sankelibettina vela - champa bilichina vela
Ankiligaa appulavaaraagina vela
Venkatesu naamamy vidipincha gathigaaga
Manku buddhi poralina mariledu theragu

ప) ఆకటి వేళల అలపైన వేళలను

తేకువ హరి నామమే దిక్కు మఱి లేదు తెఱగు


1) కొరమాలి యున్న వేళ - కులము చెడిన వేళ

చెరవడి ఒరుల చేజిక్కిన వేళ

ఒరపైన హరి నామమొక్కటే గతిగాగ

మరచి తప్పిననైన మరిలేదు తెఱగు


2) ఆపద వచ్చిన వేళ - ఆరడి పడిన వేళ

పాపపు వేళ - భయపడిన వేళ

ఓపినంత హరి నామమొక్కటే గతిగాగ

మాపు దాక బొరలిన మరిలేదు తెఱగు


3) సంకెలిబెట్టిన వేళ - చంప బిలిచిన వేళ
అంకిలిగా అప్పులవారాగిన వేళ
వేంకటేశు నామమే విడిపించ గతిగాగ
మంకు బుద్ధి బొరలిన మరిలేదు తెఱగు


No comments:

Post a Comment