Raagam: Amruthavarshini
Thaalam: Aadi (Trisra gathi)
Pa) Vasudha chooda pinnavaani valenunnavaadu
Vesananni viddelaanu velasey Vithaludu
1) Paraganedu noota dabbedi eduvuri chetha
Iravai paadinchukunnaadee Vithaludu
Sarasanaidu lakshalindla javvanapu gollethala
Maraginchukunnavaadu mari ee Vithaludu
2) Batthi thoda thana meedi paatalu paadithenu
Itthala momai thirigey ee Vithaludu
Hatthi thanolakapoga nandari vega devulla
Etthi padaalandu joope ithadey Vithaludu
3) Gattigaa Pundareekudu kadu veduka bettina
Ittika peetapainunnaadee Vithaludu
Atti thaaney Sri Venkataadri Baandurangamuna
Etti golichinaa varamulicchey Vithaludu
ప) వసుధ చూడ పిన్నవాని వలెనున్నవాడు
వెసనన్ని విద్దెలాను వెలసే విఠలుడు
1) పరగనేడు నూట డబ్బది ఏడువురి చేత
ఇరవై పాడించుకున్నాడీ విఠలుడు
సరసనైదు లక్షలిండ్ల జవ్వనపు గొల్లెతల
మరిగించుకున్నవాడు మరి ఈ విఠలుడు
2) బత్తి తోడ తన మీది పాటలు పాడితేను
ఇత్తల మోమై తిరిగే ఈ విఠలుడు
హత్తి తనోలకపోగనందరి వేగ దేవుళ్ళ
ఎత్తి పదాలందు జూపే ఇతడే విఠలుడు
3) గట్టిగా పుండరీకుడు కడు వేడుక బెట్టిన
ఇట్టిక పీటపైనున్నాడీ విఠలుడు
అట్టి తానే శ్రీ వేంకటాద్రి బాండురంగమున
ఎట్టి గొలిచినా వరములిచ్చే విఠలుడు
No comments:
Post a Comment