Raagam: Revathi
Thaalam: Aadi
తెలిసితే మోక్షము - తెలియకున్న బంధము
కలవంటిది బ్రతుకు -ఘనునికిని
అనయము సుఖమేడది - అవల దు:ఖమేడది
తనువుపై నాశలేని - తత్త్వమతికి
పొనిగితే బాపమేది - పుణ్యమేది కర్మమందు
వొనరగ ఫలమొల్లని - యోగికిని
తగినయమృతమేది - తలపగ విషమేది
తెగి నిరాహారియైన - ధీరునికి
పగవారనగ వేరి - బంధులనగ వేరి
వెగటు ప్రపంచమెల్ల - విడిచే వివేకికిని
వేవేలువిధులందు - వెఱపేది మఱపేది
దైవము నమ్మినయట్టి - ధన్యునికి
శ్రీవేంకటేశ్వరుడు - చిత్తములో నున్నవాడు
యీవలేది యావలేది - యితని దాసునికి
Thelisithey mokshamu - Theliyakunna bandhamu
Kala vantidi brathuku ghanunikini
1) Anayamu sukhamedadi - Avala duhkhamedadi
No comments:
Post a Comment