Raagam: Athaana
Thaalam: Aadi
వీడే నెలకొన్నాడు శ్రీవేంకటగిరి మీద
వీడే కౌరవుల పాలిటికి విశ్వరూపుడితడు
త్రిపురంబులపై వ్రాలిన యాఘన తీవ్ర బాణమితడు
చపలపు బాణుని మర్మభేదియగు చక్రధరుడు ఇతడు
విపరీతము కంబములో వెలసిన వీరసింహమితడు
కపటపు భస్మాసురుని పాలిటికి కాలదండమితడు
ధరణి కింద బలి నణచిన యాపాతాళభేదియితడు
పరశురాముని గర్వము నణచిన ప్రళయ వాయువితడు
ఒరసిన నరకాసురుని పాలిటికి ఉరుమని పిడుగితడు
దురమున నెదిరిన దనుజకోటులకు ధూమ కేతువితడు
అదిగో విధిరుద్రాదుల కెల్లను ఆదిమూల మితఁడు
పదిలముగా తను గొలిచిన యాశ్రితపారిజాతమితడు
కదలని యా బ్రహ్మాండ కోటులకు కన్నతండ్రి యితడు
వెతకి వెతకి వరములనన్నొసగెడి వేంకటపతి యితడు
Veedey nelakonnaadu Sri Venkatagiri meeda
Adigo Vidhi Rudraadulakellanu aadimoolamithadu
Padilamugaa thanu golichina yaasritha paarijaathamithadu
Kadalani aa brahmaanda kotulaku kannathandri ithadu
Vethaki vethaki varamulanannosagedi Venkatapathi ithadu
వీడే కౌరవుల పాలిటికి విశ్వరూపుడితడు
No comments:
Post a Comment