Raagam: Kaapi
Thaalam: Khanda gathi Aadi Thaalam
Dheerunaku vanadhi gambheerunaku dushta sam-
haarunaku ghana manee haarunakunu
Haara karpoora neehaara heeraa pateera
thaaraali keerthi visthaarunakunu
Jaya mangalam nithya subha mangalam
Mangalamu Raamunaku mahitha subha dhaamunaku
Mangalamu Seethaa samethunakunu
Mangalamu sura makuta mani lalitha paadunaku
Mangalamu ksheeraabdi mandirunaku
Jaya mangalam nithya subha mangalam
Aadyunaku Brahmaadi vedyunaku durmadaa-
bhedyunaku bhavarujaa vaidyunakunu
Sadyophalapradunaku + aadyantha rahithunaku
Vidyaa viveka jana hrudyunakunu
Jaya mangalam nithya subha mangalam
Jaithrunaku Soumithri mithrunaku bhaktha vana
Chaithrunaku nava padma nethrunakunu
Mithra vamsaabdhi sanmithrunaku sura vinuthi
paathrunaku jagadavana sthothrunakunu
Jaya mangalam nithya subha mangalam
ధీరునకు వనధి గంభీరునకు దుష్ట సం-
హారునకు ఘన మణీ హారునకును
హార కర్పూర నీహార హీరా పటీర
తారాళి కీర్తి విస్తారునకును
జయ మంగళం నిత్య శుభ మంగళం
మంగళము రామునకు మహిత శుభ ధామునకు
మంగళము సీతా సమేతునకును
మంగళము సుర మకుట మణి లలిత పాదునకు
మంగళము క్షీరాబ్ది మందిరునకు
జయ మంగళం నిత్య శుభ మంగళం
ఆద్యునకు బ్రహ్మాది వేద్యునకు దుర్మదా-
భేద్యునకు భవరుజా వైద్యునకును
సద్యోఫలప్రదునకు + ఆద్యంత రహితునకు
విద్యా వివేక జన హృద్యునకును
జయ మంగళం నిత్య శుభ మంగళం
జైత్రునకు సౌమిత్రి మిత్రునకు భక్త వన
చైత్రునకు నవ పద్మ నేత్రునకును
మిత్ర వంశాబ్ధి సన్మిత్రునకు సుర వినుతి
పాత్రునకు జగదవన స్తోత్రునకును
జయ మంగళం నిత్య శుభ మంగళం
No comments:
Post a Comment