1) ఓంకార మంత్ర బహిరంతర భాసమానే!
వేదాంత కేళి వనజాకర రాజహంసి!
ఆమ్నాయధర్మవిధి చోదన లోల చిత్తే!
గాయత్రి! దేవి! వరదే! తవ సుప్రభాతమ్॥
ఓంకార మంత్రము యొక్క బయట, లోపల ప్రకాశించుదానా! ఉపనిషత్తులనెడి ఉద్యాన సరస్సున విహరించు రాజహంసీ! వేద ధర్మములను ఆచరించుటకు ప్రేరణమిచ్చుదానా! ఓ గాయత్రిదేవీ! వరప్రదాత్రీ! ఓ తల్లీ! నీకు సుప్రభాతము (అగుగాక).
2) శయ్యాం విముంచ విబుధేంద్ర విరించి విష్ణు
రుద్రాస్త్వదీక్షణ గలత్ కరుణామృతార్థం।
బద్ధాంజలి ప్రకట భక్తి రతా నమన్తి
గాయత్రి! దేవి! వరదే! తవ సుప్రభాతమ్॥
ఓ తల్లీ! ఇంద్రుడు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులునీ కన్నుల నుండి ప్రసరించు దయామృతమును కోరి భక్తినమ్రులై వచ్చియున్నారు. నిద్ర వీడుము. నీకు సుప్రభాతము.
3) సృష్టిక్రియా నిపుణతా పరిలిప్సయా య
స్త్వామభ్రవాచ మనుసృత్య జజాప ధాతా।
సోSయం త్వదాశిష మపేక్ష్య సమాగతోSత్ర
గాయత్రి! దేవి! వరదే! తవ సుప్రభాతమ్॥
సృష్టిక్రియ యందు నైపుణ్యమును నీ నుండి పొందగోరి బ్రహ్మ ఆకాశవాణి మాటల చొప్పున నీ మంత్రమును జపించి, నీ ఆశీస్సులకై వచ్చియున్నాడు. (వాని కోర్కె తీర్పుము). ఓ తల్లీ! నీకు సుప్రభాతము.
4) త్త్వద్దివ్య సంసదభియాన మహే ముహుస్త్వ
దాసంజనార్థ ముపయుక్త భుజాస్సుసఖ్యః।
యా బ్రహ్మ విష్ణు గిరిశస్త్రియ ఆగతాస్తా
గాయత్రి! దేవి! వరదే! తవ సుప్రభాతమ్॥
నీవు కొలువు తీరుటకు వెడలు సమయమున చేతులు ఆనుకొనుటకై అలవాటుగా తమ భుజములను ఆసరాగా ఇచ్చు వాణి, లక్ష్మి, పార్వతులు వచ్చి నీముందు నిలబడియున్నారు. ఓ తల్లీ! నీకు సుప్రభాతము.
5) ఐరావణాత్ సమవతీర్య గృహాజిరే త
ఇంద్రో భవత్ సవిధ దేశ ముపాగతోSయమ్।
దోఃకీర్ణ పూర్ణ కలశేన పురోధసాSత్ర
గాయత్రి! దేవి! వరదే! తవ సుప్రభాతమ్॥
ఇంద్రుడు ఐరావతమును దిగి, పూర్ణ కలశములు ధరించిన బృహస్పతితో కూడి నీకు స్వాగతము చెప్పుటకు నీ సమీపమునకు వచ్చియున్నాడు. ఓ తల్లీ! నీకు సుప్రభాతము.
6) అన్యేచ లోకపతయ స్తవ దర్శనార్థాః
త్వన్నేత్రపీడన కరాణి కనత్ ప్రభాణి।
సంత్యజ్య రత్న మకుటాని నమన్తి భక్త్యా
గాయత్రి! దేవి! వరదే! తవ సుప్రభాతమ్॥
ఇతర దిక్పాలకులు కూడా తమ కిరీట రత్న కాంతుల వలన నీ చూపులకు విఘాతము కలుగునను భయముతో వాటిని విసర్జించి నీకు నమస్కరింప వచ్చిరి. తల్లీ! నీకు సుప్రభాతము.
7) స్వర్వాహినీ సలిల పూరిత దీర్ఘహస్తః
విఘ్నాధిపః పరమ భక్తిరస ప్రశస్తః।
ప్రాప్తోSత్ర యుష్మదభిషేచన బద్ధ బుద్ధిః
గాయత్రి! దేవి! వరదే! తవ సుప్రభాతమ్॥
నీ భక్తుడైన వినాయకుడు తన తొండముతో ఆకాశగంగా జలములను తెచ్చి, నీకు అభిషేకము చేయుటకై వచ్చియున్నాడు. తల్లీ! నీకు సుప్రభాతము.
8) సాంఖ్యాయన స్త్విహ భవజ్జని రాత్మగోత్ర
ఆసీ దితీష దుదితాస్య నటత్ సుగర్వః।
భావ్యస్స తే మృదుల మంద మనోజ్ఞ హాసైః
గాయత్రి! దేవి! వరదే! తవ సుప్రభాతమ్॥
యుష్మత్సభాభిగమనార్థ మపేక్షమాణాః।
గాయత్రి! దేవి! వరదే! తవ సుప్రభాతమ్॥
10) త్వత్ సౌఖశాయనికతా మధిగత్య శిష్యైః
శ్రీ కౌశికోముని రసౌ తవ పూర్ణ తత్త్వం।
లోకే ప్రకాశయితు కామ ఇహాగతాస్త్వాం
గాయత్రి! దేవి! వరదే! తవ సుప్రభాతమ్॥
నీకు అలవాటుగా సౌఖశాయనికత్వమును (సుఖముగా నిద్ర పోయితివా అని అడుగు ఉద్యోగివృత్తిని) వహించు విశ్వామిత్రుడు నీ మంత్రశక్తిని లోకములలో చాటు నిమిత్తము నీ దర్శనమునకు వచ్చియున్నాడు. ఓ తల్లీ! నీకు సుప్రభాతము.
11) మందేహ దానవ దవోద్దమనాయ విప్రాః
ప్రాభాతి కార్ఘ్యఘటితాంజలయః ప్రహృష్టాః।
ద్వారే వసన్తి భవదీక్షణ సంప్రతీక్షాః
గాయత్రి! దేవి! వరదే! తవ సుప్రభాతమ్॥
మందేహాది దానవులనెడి దావాగ్నిని అణగించుటకై తమ హస్తములందు అర్ఘ్యజలములను నింపి విప్రులు నీ అనుజ్ఞ కొఱకు వచ్చి వేచియున్నారు. తల్లీ! నీకు సుప్రభాతము.
12) ఓం భూర్భువస్స్వరితి తత్సవితుర్వరేణ్యం
భర్గోSనుషజ్య విమలేస్వహృది ప్రపన్నాః।
త్వత్తః ప్రచోదన మపేక్ష్య హి వర్ణి వర్గాః
గాయత్రి! దేవి! వరదే! తవ సుప్రభాతమ్॥
వ్యాహృతి త్రయముతో నీ మంత్రమును జపించుచు, దాని అర్థమును భావించుకొనుచు, నీ దర్శనాపేక్షతో బ్రహ్మచారి గణము వచ్చియున్నది. తల్లీ! నీకు సుప్రభాతము.
13) సిద్ధాంత భేద గణనాత్ ప్రవిముహ్య ముఖ్య
సూర్యోదయాస్తమయకాలవిబోధనార్థాః।
తాన్ పశ్య నైకటిక నైష్ఠిక విప్రముఖ్యాన్
గాయత్రి! దేవి! వరదే! తవ సుప్రభాతమ్॥
పలురకములైన జ్యోతిష సిద్ధాంతములవల్ల మోహముచెంది అసలు సిసలు సూర్యోదయాస్తమయ ముఖ్యకాలమును నీనుండి తెలిసికొనగోరి పెక్కురు నైష్ఠకులైన విప్రవరులు నీచెంత వసించియున్నారు. తల్లీ! నీకు సుప్రభాతము.
14) సౌగంధికాని కుసుమాని సురద్రుకీర్ణా
న్యాదాయ దివ్య వనితా ఉపగత్య నమ్రాః।
కేశ ప్రసాధన విధౌ నవరీతి మేత్య
గాయత్రి! దేవి! వరదే! తవ సుప్రభాతమ్॥
నీ కేశాలంకరణకై క్రొత్త క్రొత్త విధానములు నేర్చుకొన్న దేవకాంతలు కల్పవృక్షములయొక్క సుగంధభరితములైన పుష్పములతో వచ్చియున్నారు. ఓ తల్లీ! నీకు సుప్రభాతము.
15) స్వర్లోక సింధు వినిమజ్జన శుద్ధ దేహః
త్వద్దేహ శీర్ణ కుసుమా న్యపహేతు కామః।
మందానిలః ప్రసరతీహ గృహోపకంఠే
గాయత్రి! దేవి! వరదే! తవ సుప్రభాతమ్॥
ఆకాశగంగా ప్రవాహమున స్నానమాడి చల్లనైన శరీరముతో మెల్లగా నీ శరీరమునకంటుకున్న జీర్ణపుష్పములను తొలగించుటకై మందానిలుడు వచ్చియున్నాడు. తల్లీ! నీకు సుప్రభాతము.
16) గోలోక గోపవనితా కరమంథనోత్థ
సద్యో విభాత దధిభాండ నిరూఢ శబ్దాః।
తత్కంకణధ్వని జిగీషుతయాSరటన్తి
గాయత్రి! దేవి! వరదే! తవ సుప్రభాతమ్॥
గోలోకమునందలి గోపకాంతలు తెల్లవారుజాముననే లేచి, (నీ హోమమునకై) వెన్నకొఱకు దధిభాండములను చిలుకుచున్న చప్పుళ్ళు వారి కరకంకణధ్వనులతో పోటీపడి నీకు సుప్రభాతమును చెప్పుచున్నవా అన్నట్లున్నవి. తల్లీ! నీకు సుప్రభాతము.
17) త్వా మాహ్వయన్నివ సురద్రుమ మూలబద్ధ
స్వర్ ధేను నిర్మల పయఃకణ పాన తుష్టః।
వత్సః ప్రనృత్యతి భవద్భవనాంగణేంబే
గాయత్రి! దేవి! వరదే! తవ సుప్రభాతమ్॥
కల్పవృక్షకాండము మొదలున కట్టబడియున్న కామధేనువు పాలను తనివితీరా త్రాగి, దాని వత్సము నీ భవనప్రాంగణమున గంతులువైచుచు నిన్ను పిల్చుచున్నది. ఓ తల్లీ! నీకు సుప్రభాతము.
18) యాం స్త్వం వరై రభిమతైః పరితర్పయన్తీ
యామత్రయావధిక రాత్రి మయాపయ స్తే।
ప్రాప్తా నమస్కరణ కీర్ణ కృతజ్ఞభావాః
గాయత్రి! దేవి! వరదే! తవ సుప్రభాతమ్॥
రాత్రి మూడు జాముల వఱకు నీవలన ఆయా వరములు పొందిన భక్తులందఱు తమ కృతజ్ఞతలు తెలుపుకొనుటకై నమస్కరింపగ వచ్చియున్నారు. ఓ తల్లీ! నీకు సుప్రభాతము.
19) ఆగచ్ఛతేత్యభిమతం వదతేతి చైతత్
గృహ్ణీత చేతి యదుదార వచస్త్వమాత్థ।
ఆవర్తయన్తి తవ గేహ శుకాస్తదేవ
గాయత్రి! దేవి! వరదే! తవ సుప్రభాతమ్॥
రండు, మీ కోర్కెలను తెల్పుడు, ఇది పుచ్చుకొనుడు అని నిత్యము నీవు భక్తులతో పలుకు మాటలను మాటిమాటికి ఆవృత్తి చేయుచున్న నీ పెంపుడు చిలుకలివిగో. తల్లీ! నీకు సుప్రభాతము.
20) మందాకినీ జల పవిత్రిత రాజహంస్యః
ప్రాప్తా భవద్గమనరీతి సుశిక్షణార్థాః।
తుండాగ్ర సంభృత మృణాళ నవోపహారాః
గాయత్రి! దేవి! వరదే! తవ సుప్రభాతమ్॥
ఆకాశగంగానదియందు స్నానముచేసి పవిత్రదేహములు దాల్చిన ఆడుహంసలు ఆ నదియందలి తామరతూండ్లను నీకు కానుకగా ఇచ్చి, నీ నుండి నడకల అందమును నేర్చుకొనుటకై వచ్చియున్నవి. తల్లీ! నీకు సుప్రభాతము.
No comments:
Post a Comment