Sunday 26 June 2022

Adevo Alladevo Sri Hari Vaasamu - Annamacharya Keerthana



Raagam: Madhyamavathi

Thaalam: Aadi


ప) అదెవో అల్లదెవో శ్రీ హరివాసము

పదివేల శేషుల పడగలమయము

1) అదే వేంకటాచల మఖిలోన్నతము
దెవో బ్రహ్మాదుల కపురూపము
దెవో నిత్య నివాస మఖిల మునులకు
అదే చూడుడు అదే మ్రొక్కుడు ఆనందమయము

2) చెంగట నల్లదెవో శేషాచలము
నింగినున్న దేవతల నిజవాసము
ముంగిట నల్ల
దెవో మూలనున్న ధనము
బంగారు శిఖరాల బహు బ్రహ్మమయము

3) కైవల్యపదము వేంకటనగమదెవో
శ్రీవేంకటపతికి సిరులైనది
భావింప సకల సంపదరూపమదివో
పావనములకెల్ల పావనమయము

Pa) Adevo alladevo Sri Hari vaasamu
Padivela seshula padagala mayamu


1) Adey Venkataachalam akhilonnathamu
Adevo Brahmaadulakapuroopamu
Adevo nithya nivaasamakhila munulaku
Adey choodu adey mrokkudu aanandamayamu

2) Chengatanalladevo Seshaachalamu
Ninginunna devathala nijavaasamu
Mungitanalladevo moolanunna dhanamu
Bangaaru sikharaala bahu Brahmamayamu

3) Kaivalya padamu Venkata nagamadevo
Sri Venkatapathiki sirulainavi
Bhaavimpa sakala sampada roopamadivo
Paavanamulakella paavanamayamu

No comments:

Post a Comment