Tuesday, 6 September 2022

Vandana sathamidi - Dr.Krishna Subbarao Ponnada

Lyrics: Dr. Krishna Subbarao Ponnada


వందన శతమిది, చందన శీతల హిమగిరి మకుట ధరీ

పరివృతసాగర మణిమయ పూరిత జీవనవేదకరీ

వికసిత మనముల రసమయ గీతుల విలసిత భావఝరీ

కిలకిల నగవులు ఒలికెడి కళలను నిలిపిన రాగధరీ


అతులిత ప్రతిభను జగతికి పంచిన సుతులకు ప్రేమమయీ

పరిపరి విధముల పొగడెద జననిని, పదముల కరములిడి

రుధిరము నిండుగ ప్రతిభను పొదిమి ప్రగతిన నిలుపమని

తరతమ భేదం సమయగ మనముల శాంతిని నింపమని

సమరస భావం తొణికిసలాడగ మనసులు కలుపమని

సతతము చాటెద భారత కీర్తిని పృథ్విని నలుదెసల


హయ గజ పద దళ అతిరథ శూరుల నిలయము భారతని

జగతికి ప్రగతిని పంచిన జననికి ధర్మమె శ్వాసయని

శాంతీ సహనం సౌభ్రాతృత్వం భారత ధర్మమని

సతతము చాటెద భారత కీర్తిని పృథ్విని నలుదెసల


నిరతము తలచెద, పరవశ మనమున జననీ జయ జననీ, జననీ జయ జననీ 

No comments:

Post a Comment