Friday, 12 January 2024

Characteristics of Kalyani Raaga - కళ్యాణి రాగ లక్షణములు

  • ఇది 65వ మేళకర్త రాగము. కటపయాది సంఖ్యలో చేర్చుటకై ఈ రాగమునకు ముందు “మేచ” అను పదము చేర్చబడినది. కనుక “మేచకళ్యాణి” అని పిలవబడుచున్నది.

    ఆరోహణ సరిగమపదనిస.

    అవరోహణ స.నిదపమగరిస

    శృతులు: షడ్జము, చతుశృతి రిషభము, అంతర గాంధారము, ప్రతిమధ్యమము, పంచమము, చతుశృతి దైవతము, కాకలి నిషాదము

    లక్షణములు: ఇది ప్రసిద్ధ ప్రతిమధ్యమరాగము. చాలా జన్యరాగ సంతతిగల జనకరాగము. సంపూర్ణ రాగము.

    పామగా అనునప్పుడు గాంధారము అంతరగాంధారముకంటే ఎక్కువ పలుకుచున్నది. కనుక ఈ రాగ గాంధారమునకు తీవ్ర అంతర గాంధారము అని పేరు. దీనిని చ్యుతమధ్యమము అని కూడా చెప్పుదురు. సర్వస్వరగమకవరికరక్తిరాగము. ఆరోహణ, అవరోహణమునందలి అన్ని స్వరములు రాగచ్ఛాయాస్వరములు. గగమమదదనిని, మమదదనినిరి.రి. అను జంటస్వర ప్రయోగములు, నిగ.రి.నిద, దరి.నిదమ, మనిదమగ అను దాటు ప్రయోగములు ప్రసిద్ధాలంకారములు. స్ఫురితము, ప్రత్యాహతము అను గమకములు హెచ్చుగా వచ్చును. అన్నివేళలా పాడదగిన రాగము. కానీ సాయంకాల వేళలో పాడుట సమంజసము. రిషభము విశేషన్యాసము.

    సంచారము: గమాపా - మపదనీదప - దనిసా. - స.నిగ.రి.స.నిద - దనిరీ.స.దప - గదపమగరి - మగరిసా - .నిసరిగమాప - దనిపదనిసా. - స.నిగరి.స.నిద - నిరి.నిదపా - మదమగరీ - రిగమపామగారీ - మగరిసా - .ద.నీసా

    రచనలు:

    గీతము: కమలజాదళ - త్రిపుటతాళం - పురంధరదాసు

    వర్ణము: వనజాక్షిరో - ఆదితాళం - రామ్నాడ్ శ్రీనివాస అయ్యంగార్

    కృతులు: అమ్మరావమ్మ - చాపుతాళం - త్యాగరాజస్వామి

    వాసుదేవయని - ఆదితాళం - త్యాగరాజస్వామి

    కమలాంబాం భజరే - ఆదితాళం - ముత్తుస్వామి దీక్షితార్

    నీదు చరణ పంకజంబే - ఆదితాళం - పల్లవి గోపాలయ్యర్

    హిమాద్రిసుతే - రూపకతాళం - శ్యామశాస్త్రి

    నినువినా గతిగాన - ఆదితాళం - సుబ్బరాయశాస్త్రి


  • Kalyani is a Sampoorna Raagam.
  • It is the 65th Melakartha Raaga.
  • It is also referred as 'Mechakalyani' to fit it into Katapayaadi formula.
  • It is the 5th raagam in the 11th chakram (Rudra chakram).
  • It is a Prathi Madhyama raagam. Kalyani is the first Prathi Madhyama raga that was ever discovered.
  • Moorchana of Kalyani is:
    • S R2 G3 M2 P D2 N
    •  N₃ D₂ P M₂ G₃ R₂ S
  • Swarasthanas of Kalyani raagam are
    • Shadjam
    • Chathussruthi Rishabham
    • Anthara Gaandhaaram
    • Prathimadhyamam
    • Panchamam
    • Chathussruthi Daivatham
    • Kaakali Nishaadam
  • Its equivalent in Hindustani music is 'Yaman'.
  • Its Western equivalent is 'Lydian mode'.
  • It is prominently played in South Indian weddings.
  • The word Kalyani means she who causes auspicious thingsIt is often performed at the beginning of concerts because it is considered auspicious.
  • It has scope for elaborate aalaapana.
  • It is a Sarva Swara Gamaka Vaarika Rakthi raaga.
  • It is also used in Hungarian music.
  • The most auspicious time to sing Kalyani is 4 pm to 8 pm.
  • This raga is very significant to the chart, because it is sung with all higher notes.
  • Some janya raagas of Kalyani are
    • Hamir Kalyani
    • Amritha Kalyani
    • Mohana Kalyani
    • Saranga
    • Nada Kalyani
    • Sunadavinodini
    • Yamunakalyani/ Yaman Kalyan
  • Popular compositions in Kalyani are
    • Nidhi chāla sukhamā - Thyagaraja
    • Etavunnārā - Thyagaraja
    • Sundari nī Divya - Thyagaraja
    • Ammā Rāvammā - Thyagaraja
    • Sandehamu Elara - Thyagaraja
    • Bhajana Seyave - Thyagaraja
    • Nammi Vacchina - Thyagaraja
    • Vāsudēvanyani - Thyagaraja
    • Kamalāmbāṃ bhajarē - Muthuswamy Dikshitar
    • Shiva Kameshwarim Chintayeham  - Muthuswamy Dikshitar
    • Himādri sutē pāhimaṃ - Shyama Sastri
    • Birāna varālichi - Shyama Sastri
    • Talli Ninnu Nēranammi - Shyama Sastri
    • Nannu brovamani cheppave - Bhadrachala Ramadasu
    • Thanom nom tara thillana - Mangalampalli Balamurali Krishna 


    

No comments:

Post a Comment