Friday, 12 January 2024

Characteristics of Kambhoji Raaga - కాంభోజి రాగ లక్షణములు

  • ఇది 28వ మేళకర్త అయిన హరికాంభోజి రాగజన్యము.

    ఆరోహణ సరిగమపదస.

    అవరోహణ స.నిదపమగరిస

    శృతులు: షడ్జము, చతుశృతి రిషభము, అంతర గాంధారము, శుద్ధమధ్యమము, పంచమము, చతుశృతి దైవతము, కైశికి నిషాదము (కాకలి నిషాదము అన్యస్వరము).

    లక్షణములు: వర్జ్య రాగము, నిషాదము ఆరోహణమునందు వర్జింపబడినది. ఏకాన్యస్వర భాషాంగరాగము. సా,నిపదసా అను ప్రయోగములో కాకలి నిషాదము ప్రయోగింపబడును. తక్కిన సంచారములలో కైశికి నిషాదమును ఉపయోగించవలెను. రిమగసా - రిపమగసా - దగ.రి.స.నిదా అను దాటువులు ప్రసిద్ధములు. మధ్యమ, దైవత,  కాకలినిషాదములు రాగచ్చాయా స్వరములు. గాంధార, మధ్యమ, పంచమ, దైవతములు న్యాస స్వరములు. సర్వస్వర గమకవరిక రక్తిరాగము. రాగమును చాలాసేపు ఆలపించుటకు తగినది. అన్ని సమయములందు పాడవచ్చును. అన్ని రకములైన రచనలు ఈ రాగమునందు రచింపబడినవి. సంగీత రత్నాకరమునందు, సంగీత మకరందము, సంగీతసమయసారము, స్వరమేళకళానిధి, రాగవిభోగము, చతుర్దండిప్రకాశిక, సంగీతసారామృతము మున్నగు గ్రంథములలో కాంభోజిరాగము మేళముగా ప్రముఖస్థానము అలంకరించినది.

    ఈ రాగములో రిషభమును అవరోహణమునందు న్యాసము చేయరాదు. మధ్యమము కంపితస్వరము. మగపదస ప్రయోగము ఒకొక్కప్పుడు గపదసా., అగును. సనీద-పమాగ సంవాది జతలు. సనీద ప్రయోగములో నిషాదము ఎంత లలితముగా, గమకపూరితముగా పలుకుచున్నదో, అదే విధముగా పమగ ప్రయోగములో మధ్యమమును పలుకవలెను. త్రిస్థాయిరాగము. విస్తారమైన ఆలాపనకు వీలైన రాగము. ఉత్తమరాగము. బహురసప్రధానరాగము. వ్యాప్తిగల రాగము.

    దీనిని మలయాళ దేశీయులు “కామోదరై” అని పిలుచుదురు. ఈ రాగములోని దైవతము సరియగు చతుశృతి దైవతము కాదు. తిశృతి దైవతము (⅝ ఫ్రీక్వెన్సీ). సభారంభమున పాడదగిన రాగము. మంగళకరమైన రాగము. షడ్జ, గాంధార, మధ్యమ, పంచమ, దైవతములపై రచనలు ప్రారంభించబడును. మగసా - పదమా - మగపదస - సరిగస  అనునవి రంజక ప్రయోగములు.

    రచనలు:

    గీతము: మంధరధారే - ఆదితాళం - పైడాల గురుమూర్తిశాస్త్రి

    వర్ణము: సరసిజనాభ - అటతాళం - వడివేలుపిళ్ళై

    తరుణీ నన్నుబాసి - ఆదితాళం - ఫిడేల్ పొందుస్వామి

    కృతులు:

    మా జానకి - ఆదితాళం - త్యాగరాజు

    ఎవరి మాట - ఆదితాళం - త్యాగరాజు

    శ్రీ సుబ్రహ్మణ్యాయ - రూపకతాళం - దీక్షితార్



  • Kambhoji is the Janya raagam of Hari Kambhoji, which is the 28th Melakartha raagam.
  • The scale of Kambhoji is also said to have been derived from Cambodia.
  • The Moorchana of Kambhoji is:
    • Arohana: S R2 G3 M1 P D2 S
    • Avarohana: S N2 D2 P M1 G3 R2 S
  • It has existed since the 7th century.
  • Usage of "n3" in phrase "npds" makes Kambhoji a Bhaashaanga raaga (a raga that includes notes other than what is in the parent raga).
  • It is a Shadava (6 notes in Arohana) Sampoorna (all 7 notes in Avarohana) raagam.
  • Nishaadam is absent in aarohana, so it is a varjya raagam.
  • It is a Shaadava Sampoorna Bhaashaanga Raagam.
  • It is styled as a deshi raagam and a jana ranjaka raagam.
  • This raagam has ample scope for aalaapana, mainly used in Raagam-Thaanam-Pallavi.
  • It is frequently sung in concerts.
  • Kambhoji is classified as a female raagam (Raagini).
  • It conveys shringaara, haasya, kaarunya and adbhutha rasas.
  • The most auspicious time to sing this raagam is in the evening (4 pm to 8 pm), though it can be sung at any time.
  • The Deity of this raagam is Lord Shiva.
  • Its equivalent in Hindustani music is Raaga Kamod/ Kamodi/ Khamaj.
  • There are numerous references to Raga or Ragini called Kambhoji in ancient Indian musical traditions.
  • Popular compositions in Kambhoji
    • Devi Ni Padasarasamule - Shyama Sastri
    • Sri Subrahmanyaya Namaste - Muthuswamy Dikshitar
    • Marakatavallim - Muthuswamy Dikshitar
    • Kailsanathena - Muthuswamy Dikshitar
    • Gopala Krishnaaya - Muthuswamy Dikshitar
    • Kashi Vishveshvara - Muthuswamy Dikshitar
    • Samba Sadashivaaya - Muthuswamy Dikshitar
    • Maa Janaki - Thyagaraja
    • Elara Sri Krishna - Thyagaraja
    • Evari Mata - Thyagaraja
    • Mahita Pravrddha - Thyagaraja
    • Sri Raghuvara - Thyagaraja
    • Marimari Ninne - Thyagaraja
    • Margamu Telupave - Thyagaraja

No comments:

Post a Comment