ప) శ్రీమన్నారాయణుని చెంతకు చేరరే
కమలా ప్రియవిభుని గని కైమోడ్చి మ్రొక్కరే
1) జనకసుతావల్లభుని కనుగొని కొలువరే
మనమున మురళీధరు నామమును సదా నిలుపరే
జననమరణభయహారుని స్మరణము సలుపరే
దినదినమును హరి మహిమను తెలిసి సేవించరే
2) జగములెల్లనేలేటి జనకుని cగాంచరే
నగధరుని దర్శించి అగురు ధూపములిడరే
పగడంపు కాంతుల దీ ప ము చూపి తరించరే
ఖగపతి వాహనునికి కప్పురపు హారతీరే
Pa) Srimannarayanuni chenthaku cherare
Kamalaa priya vibhuni gani kaimodchi mrokkare
1) Janaka sutha vallabhuni kanugoni koluvare
Manamuna Muralidharu naamamunu sadaa nilupare
Janana marana bhayahaaruni smaranamu salupare
Dinadinamunu Hari mahimanu thelisi sevinchare
2) Jagamulellaneleti janakuni gaanchare
Nagadharuni darsinchi aguru dhoopamulidare
Pagadampu kaanthula deepamu choopi tharinchare
Khagapathi vaahanuniki kappurapu haaratheere
No comments:
Post a Comment