Learnt the song from Smt. Bhamidi Kamaladevi Gaaru
Pa) Nagula chavithiki Nagendra neeku
potta nindaa paalu posemu thandri
1) Nee putta dariki maa paapaloccheru
Paapa punyammula vaasaney leni
Brahma swaroopulou pasi koonaloyi
Kopinchi busalu kottabokoyi
2) Cheekatilona nee sirasu thokkemu
Kasi theera mammalni kaateyaboku
Kova buttaloni kode Naaganna
Pagalu saadhinchi maa praanaalu theeku
3) Artharaathri vela aparaathri vela
Paapamemerugani pasulu thirigeney
Dharaniki jeevanaadhaaraalu summi
vaatini kopaana kaateyaboku
4) Atu konda itu konda aa renti naduma
naagulla kondalo naatyamaadeti
divya sundara naaga dehi annaamu
kanipetti mammalni kaapaadavoyi
ప) నాగుల్ల చవితికి నాగేంద్ర నీకు
పొట్టనిండా పాలు పోసేము తండ్రి
1) నీ పుట్ట దరికి మా పాపలొచ్చేరు
పాపపుణ్యమ్ముల వాసనే లేని
బ్రహ్మ స్వరూపులౌ పసి కూనలోయి
కోపించి బుస్సల్లు కొట్టబోకోయి
2) చీకటిలోన నీ శిరసు తొక్కేము
కసితీర మమ్మల్ని కాటేయబోకు
కోవ బుట్టలోని కోడెనాగన్న
పగలు సాధించి మా ప్రాణాలు తీకు
3) అర్థరాత్రివేళ అపరాత్రివేళ
పాపమేమెరుగని పశులు తిరిగేనే
ధరణికి జీవనాధారాలు సుమ్మీ
వాటిని కోపాన కాటేయబోకు
4) అటు కొండ ఇటు కొండ ఆ రెంటి నడుమ
నాగుల్ల కొండలో నాట్యమాడేటి
దివ్య సుందర నాగ దేహి అన్నాము
కనిపెట్టి మమ్మల్ని కాపాడవోయి
No comments:
Post a Comment