Friday, 29 November 2024

Samartha Perantam Sampradaaya Paata 1 - Traditional Song

శ్రీరమణి భూసుతయు సీతవై పుట్టి

కూరిమ్మి జనకునకు కూతురై పెరిగి

శ్రీరామచంద్రులను  చెలఁగి పెండ్లాడి

ఆ రమణి వినయమున అత్తమామలకు

పరిచర్య చేయుచును పతిభక్తితోను

పెరుగుచుండెను సీత పెంపు తీరుగను

దిగువాయె తన త్రోవ మోము కళలాయె

మోమున ఒక చిన్న మొటిమగా మొలిచె


అల్లో నేరేడల్లో వెలది జానకి సమర్థ వేడుకలాయె


కోమలి ప్రాయంబు కోమల్లికిపుడు

పసిబూసి పమిట చెంగుల చీర కట్టి

ఆట కూటంబున ఆ నగరిలోన

ఆడుచుండెను సీత చెలుల తోడుగను

మగువ చేరువనున్న ముత్తైదుజూసి

పడతికి సమర్థ ప్రాయంబులాయె

అందెలు కదలగా కుందనాలాడ

హంస నడకల తల్లి రావమ్మయనుచు

అల్లో నేరేడల్లో వెలది జానకి సమర్థ వేడుకలాయె


కౌసల్య కోడలిని నాతి ఇటు పిలువ

నాతి కట్టిన చీర విప్పి చూడగను

ఎవ్వరినంటక హేమ పీఠమున

రివ్వున కూర్చుండె మర్యాదతోను

సిగ్గుపడె జానకి శిరస్సు వంచి

అత్త కౌసల్యయు ఎదుటనే నిలిచి

అరుంధతిని పిలిపించె అపుడు కౌసల్య

సరిలేదు మన సీత సమర్థలాడె

అల్లో నేరేడల్లో వెలది జానకి సమర్థ వేడుకలాయె


వెలది పంచాంగమ్ము విప్పి చూడగను

అమర పాద సేవ ఆనందమై తోచె

ఆదివారము నాడు అతివ రోగిష్ఠి

సోమవారము నాడు సోమ పతివ్రతయు

మంగళవారము నాడు మగువకు చింత

బుధవారము నాడు పుత్రులనెత్తు

లక్ష్మివారము నాడు కూడు సంపదలు

శుక్రవారము నాడు సుదతి సుఖపడును

శనివారము నాడు సతి పేదరాలు

పౌర్ణమి నాడైతే పుట్టు భోగములు

అల్లో నేరేడల్లో వెలది జానకి సమర్థ వేడుకలాయె


పాడ్యమి నాడైతే పడతి వేరుండు

విదియ నాడైతే విధిశాలియగును

తదియ నాడాడితే తగు బుద్ధిశాలి

చవితందు కలహములు వెలిసేటి దినము

బాగు పంచమినాడు భాగ్యశాలియగును

షష్ఠినాడాడితే సత్యవతియగును

సప్తమి నాడాడితే సతి పేదరాలు

అష్టమి నాడాడితే అతివ రోగిష్ఠి

నవమి నాడాడితే నళినాక్షి చింత

దశమి నాడాడితే దశవంతురాలు

అల్లో నేరేడల్లో వెలది జానకి సమర్థ వేడుకలాయె


ఏకాదశి నాడు వింధ్యాయజాక్షి

పరులు నిందింతురే పడగ ద్వాదశిని

తన్నులు తగులునే త్రయోదశినాడు

సాగరాని పనులు చతుర్దశినాడు

పరమపురుషుని పాపమమవాస్యనాడు

అని చెప్పె మునివరులు అరుంధతితోను

అల్లో నేరేడల్లో వెలది జానకి సమర్థ వేడుకలాయె


శ్రీరమణి భూసుతయు సీతవై పుట్టి

కూరిమ్మి జనకునకు కూతురై పెరిగి

కోవిళ్ళు గంపలతో కైలాస పసుపు

ఎత్తగలవారిచే ఎత్తించుకోండి

వెలదికి సమర్థ వేడుకలాయె

పడతికి సమర్థ పండుగలాయె

అల్లో నేరేడల్లో వెలది జానకి సమర్థ వేడుకలాయె


Sri ramani bhoosuthayu Seethavai putti

Koorimmi Janakunaku koothurai perigi

Sri Ramachandrulanu chelagi pendlaadi

Aa Ramani vinayamuna atthamaamalaku

paricharya cheyuchunu pathi bhakthithonu

peruguchundenu Seetha pempu theeruganu

diguvaaye thana throva momu kalalaaye

Momuna oka chinna motimagaa moliche

Allo Neredallo veladi Janaki samartha vedukalaaye


Komali praayambu komallikipudu

pasiboosi pamita chengula cheera katti

aata kootambuna aa nagarilona

aaduchundenu Seetha chelula thoduganu

Maguva cheruvanunna mutthaidujoosi

Padathiki samartha praayambulaaye

Andelu kadalaga kundanaalaada

Hamsa nadakala thalli raavammayanuchu

Allo Neredallo veladi Janaki samartha vedukalaaye


Kousalya kodalini naathi itu piluva

Naathi kattina cheera vippi choodaganu

Evvarinantaka hema peethamuna

Rivvuna kurchunde maryaadathonu

Siggupade Janaki sirassu vanchi

Attha Kousalyayu edutane nilachi

Arundhathini pilipinchi apudu Kousalya

Sariledu mana Seetha samarthalaade

Allo Neredallo veladi Janaki samartha vedukalaaye


Veladi panchaangammu vippi choodaganu

amara paada seva aanandamai thoche

Aadivaaramu naadu athiva rogishthi

Somavaaramu naadu soma pathivrathayu

Mangalavaaramu naadu maguvaku chintha

Budhavaaramu naadu puthrulanetthu

Lakshmivaaramunaadu koodu sampadalu

Sukravaaramu naadu sudathi sukhapadunu

Sanivaaramu naadu sathi pedaraalu

Pournami naadaithe puttu bhogamulu

Allo Neredallo veladi Janaki samartha vedukalaaye


Paadyami naadaithe padathi verundu

Vidiya naadaithe vidhisaaliyagunu

Thadiya naadaadithe thagu buddhisaali

Chavithandu kalahamulu veliseti dinamu

Baagu panchami naadu bhaagyasaaliyagunu

Shashthinaadaadithe sathyvathiyagunu

Sapthaminaadaadithe sathi pedaraalu

Ashtami naadaadithe athiva rogishthi

Navami naadaadithe nalinaakshi chintha

Dasami naadaadithe dasavanthuraalu

Allo Neredallo veladi Janaki samartha vedukalaaye


Ekaadasi naadu Vindhyaayajaakshi

Parulu nindinthure padathi dwaadasini

Thannulu thagulune thrayodasinaadu

Saagaraani panulu chathurdasi naadu

Paramapurushuni paapamamaavaasya naadu

ani cheppe munivarulu Arundhathithonu

Allo Neredallo veladi Janaki samartha vedukalaaye


Sree Ramani Bhoosuthayu Seethavai putti

Koorimmi Janakunaku koothurai perigi

Kovillu gampalatho Kailaasa pasupu

Etthagalavaariche etthinchukondi

Veladiki samartha vedukalaaye

Padathiki samartha pandugalaaye

Allo Neredallo veladi Janaki samartha vedukalaaye



No comments:

Post a Comment