Raagam: Sankarabharanam
Thaalam: Aadi
Pa) Naapaali Sri Rama bhoopaalaka sthoma
Kaapaada samayamu nee paadamuleeraa
1) Bhali bhali bhaktula poojaaphalamu neevanukonti
nalina lochana neeku nalugu petteraa
2) Koti manmathulaina saatigaa nee sogasu
naatiyunnadi madini meti Sri Rama
3) Tholi poojaa phalamemo kalige nee pada seva
naluvakainanu ninnu theliyaga tharamaa
4) Pathitha paavana neevu paalinchakuntenu
gathi maakevaru mammu grakkuna brovu
5) Kori nee paada seva saareku seyanu thalachi
maa ramana naa lone marulukonnaanu
6) Nirupedakabbina nidhi reethi dorikithivi
vara Thyaagaraajuni varada mrokkeraa
ప. నాపాలి శ్రీ రామ భూ-పాలక స్తోమ
కాపాడ సమయము నీ పాదములీరా
1. భళి భళి భక్తుల పూజా ఫలము నీవనుకొంటి
నళిన లోచన నీకు నలుగు పెట్టేరా
2. కోటి మన్మథులైన సాటిగా నీ సొగసు
నాటియున్నది మదిని మేటి శ్రీ రామ
3. తొలి పూజా ఫలమేమో కలిగె నీ పద సేవ
నలువకైనను నిన్ను తెలియగ తరమా
4. పతిత పావన నీవు పాలించకుంటేను
గతి మాకెవరు మమ్ము గ్రక్కున బ్రోవు
5. కోరి నీ పద సేవ సారెకు సేయను తలచి
మా రమణ నా లోనే మరులుకొన్నాను
6. నిరుపేదకబ్బిన నిధి రీతి దొరిగితివి
వర త్యాగరాజుని వరద మ్రొక్కేరా
No comments:
Post a Comment