Raagam: Madhyamavathi
Thaalam: Aadi
Pa) Nagumomu galavaani naa manoharuni
jagamelu sooruni Janaki varuni
1) Devaadi devuni divya sundaruni
Sri Vasudevuni Seetha Raaghavuni
2) Sujnaana nidhini soma surya lochanuni
ajnaana thamamunu anacu bhaaskaruni
3) Nirmalaakaaruni nikhilaagha haruni
dharmaadi mokshambu daya cheyu ghanuni
4) Bodhatho palumaaru piijinchi nenaa
-raadhinthu Sri Thyagaraja sannuthuni
ప. నగు మోము గల వాని నా మనో-హరుని
జగమేలు శూరుని జానకీ వరుని
1) దేవాది దేవుని దివ్య సుందరుని
శ్రీ వాసు-దేవుని సీతా రాఘవుని
2) సుజ్ఞాన నిధిని సోమ సూర్య లోచనుని
అజ్ఞాన తమమును అణచు భాస్కరుని
3) నిర్మలాకారుని నిఖిలాఘ హరుని
ధర్మాది మోక్షంబు దయ చేయు ఘనుని
4) బోధతో పలుమారు పూజించి నేనా-
-రాధింతు శ్రీ త్యాగరాజ సన్నుతుని
No comments:
Post a Comment