Monday, 17 March 2025

Chittithalliki nedu seemanthamu - Seemantham song

Chittithalliki nedu seemanthamu

Sri Ramarakshayani deevinthamu


Ninna monnati paapa thaanu illaalai

Bangaaru thalligaa avatharinchey vela

Pasupu kumkumalicchi pasidi gaajulu thodigi

Paripari vidhamula deevinthamu

Pacchagaa noorellu jeevimpagaa


Parimala gandhaalu paaraani aladi

Pandlu poolu icchi padathi odi nimpi

Mudamaara mudithanu deevinthamu

Kalalannee nijamulai phaliyimpagaa

Pandanti paapaayi prabhavimpagaa


చిట్టితల్లికి నేడు సీమంతము - శ్రీ రామరక్షయని దీవింతము


నిన్న మొన్నటి పాప తాను ఇల్లాలై

బంగారుతల్లిగా అవతరించే వేళ

పసుపు కుంకుమలిచ్చి పసిడి గాజులు తొడిగి

పరిపరి విధముల దీవింతము

పచ్చగా నూరేళ్ళు జీవింపగా


పరిమళ గంధాలు పారాణి అలది

పండ్లు పూలు ఇచ్చి పడతి ఒడి నింపి

ముదమార ముదితను దీవింతము

కలలన్నీ నిజములై ఫలియింపగా

పండంటి పాపాయి ప్రభవింపగా


No comments:

Post a Comment