Seethamma thalliki seemanthamu
cheyaga raarey chelulandaroo
Santhasammugaa athivalandaroo
subhamasthu antoo kadali vaccheru
Malle jaaji manchi sampengalu
Kurulandu unchiri sreemukhulu
Attharu panneeru gandhamunu
Janaki menuna chilikincheru
Odibiyyamu chalimidi katnammulu
pasupu kumkuma cheera saarelu
Pasidi gaajulu madhura phalamulatho
Vedukagaanu odi nimperu
Santhasammugaa ghanamaina saarenu
puttintivaaru theccheru
Santhsanthaanamu kalugavalenani
Atthintivaaru deevincheru
Akshinthalatho athithulandaroo
aseessulanu kuripincheru
సీతమ్మ తల్లికి సీమంతము - చేయగ రారే చెలులందరూ
సంతసమ్ముగా అతివలందరూ - శుభమస్తు అంటూ కదలి వచ్చేరు
మల్లె జాజి మంచి సంపెంగలు - కురులందు ఉంచిరి శ్రీముఖులు
అత్తరు పన్నీరు గంధములు - జానకి మేనున చిలికించేరు
ఒడిబియ్యం చలిమిడి కట్నమ్ములు - పసుపు కుంకుమ చీరసారెలు
పసిడి గాజులు మధుర ఫలములతో - వేడుకగాను ఒడి నింపేరు
సంతసమ్ముగా ఘనమైన సారెను - పుట్టింటివారు తెచ్చేరు
సత్సంతానము కలుగవలెనని - అత్తింటివారు దీవించేరు
అక్షింతలతో అతిథులందరూ - ఆశీస్సులను కురిపించేరు
No comments:
Post a Comment