Thursday, 11 September 2025

గాత్ర సంస్కృతి

  •  గాత్ర సంస్కృతి = సులభంగా పాడే పద్ధతి
  • సంస్కృతి = సంస్కారం
  • శాస్త్రీయ సంగీతానికి, జానపద సంగీతానికి వారధి లాంటిది లలిత సంగీతం.
  • సంగీత, సాహిత్య కలయికతో వివిధ భావాల్ని ప్రకటించగలదు కాబట్టి పండితుల్ని, పామరుల్ని కూడా ఆకర్షించగలదు లలిత సంగీతం.
  • లలితగీతాన్ని జనరంజకం చేయాలంటే గాయకులకు భాషపై అవగాహన, భావ వ్యక్తీకరణ కలిగి ఉండాలి.
  • శాస్త్రీయ సంగీతంలోని కృతులు, కీర్తనలు మొదలైన వాటిలో భక్తి ప్రధాన అంశంగా ఉంటుంది. కానీ లలిత సంగీతంలో
    • భక్తిగీతాలు
    • ప్రేమగీతాలు
    • విరహగీతాలు
    • భావగీతాలు
    • దేశభక్తిగీతాలు
    • ప్రబోధగీతాలు
    • ప్రకృతి గీతాలు
    • సందేశాత్మక గీతాలు
    • విప్లవగీతాలు
      వీటిలో ఎక్కువగా భావాలు పలికించాల్సిన అవసరం ఉండటంవలన గాయకులకు గాత్ర సంస్కృతి తెలియటం అవసరం.
  • స్వరజ్ఞానంతోపాటుగా గాయకులందరూ అవగాహన చేసుకోవలసినవి:
    • భావము
    • పద ఉచ్చారణ
    • మాడ్యులేషన్
    • టోనల్ క్వాలిటీ

  • భావవ్యక్తీకరణ:
    • గీతాన్ని రచించేటప్పుడు కవి ఒక దృశ్యాన్ని చిత్రీకరించుకుంటాడు. గాయకులూ ఆ గీతాన్ని ఆలపించినప్పుడు వినే ప్రేక్షకులకు కవి హృదయం కనిపించేటట్టు/ వినిపించేటట్టు భావవ్యక్తీకరణ చేయాలి.
    • సంగీతానికి, సాహిత్యానికి తగు మోతాదులో ప్రాధాన్యతనివ్వాలి.
    • భావం తెలియకపోతే అడిగి తెలుసుకొని పాడాలి.
    • రాగాలాపన, స్వరకల్పన లలితసంగీతంలో జోడించరు. భావానికి అందం తీసుకువస్తుంది అనిపించినప్పుడే ఆలాపన చేయాలి.
    • ప్రేమగీతాల్లో అన్యస్వర ప్రయోగం, హిందుస్తానీ సంప్రదాయం ఎక్కువగా రక్తికడుతుంది (అతికినట్టు పాడితేనే).
    • సంగీతపరంగా, సాహిత్యపరంగా గీతంలోని ప్రతి భావాన్ని పలికించగలగటం  ఉత్తమ గాయకుడి లక్షణం.
      • ఏదైనా పదంలోని ఒక స్వరానికి బదులు కింది స్వరమో పై స్వరమో పాడి, మార్చటంవల్ల భావం పెంపొందుతుంది.
        • ఉదా: జయజయజయ ప్రియభారత: ఇందులో జయమదీయ హృదయాశయ అనే వాక్యంలో "మదీయ" రెండు సంగతులతో "మదీయ" లో మ కి ఒకచోట 'స', ఇంకోచోట 'ని' వాడటంవల్ల, ఆ పదానికి emphasis ఇచ్చినట్టు అయ్యి, భావం ఇనుమడిస్తుంది. (జయమదీయ = గగ సగాగ, గగ నిగాగ). 
      • పాటలోని స్వరాల అమరికను బట్టి, అది ప్రేమగీతమా, విరహగీతమా, కరుణరసమా, హుషారైన గీతమా అనేది అర్థంచేసుకోవాలి. ఉదా: శివరంజని రాగం:
          • సాధారణంగా విషాదానికి వాడతారు. (ఉదా:Mera naam joker movie లోని జానే కహాఁ గయే వో దిన్)
          • అదే రాగాన్ని హుషారుగా కూడా ఉపయోగించారు. (ఉదా: వగల రాణివి నీవే, movie: బందిపోటు)
      • కనుక భావాన్ని పలికించటంలో తేడా చూపించటంవల్ల అదే రాగంలో రెండు రకాల భావాలను అందంగా పలికించవచ్చు.
      • అవే స్వరాలను భావానికి అనుగుణంగా ముద్దుగానో, భావంగానో, ప్రశ్నించే విధంగానో, శరణుకోరే విధంగానో భావప్రకటన చేయచ్చు.

  • పద ఉచ్చారణ:
    • పాట 3 స్థాయిల్లో ఎక్కడ ఉన్నా, పదాలను మింగకుండా స్పష్టంగా పలకాలి.
    • ళ-ల, ణ-న, శ-ష-స వంటి అక్షరాలు పలకాలంటే ఎక్కడ నాలుక స్పృశించాలో తెలుసుకోవాలి.
      • ఉదా: సమర్పన, షివ, కాల్లు వంటి ఉచ్చారణను మానాలి.
    • బాధ, భేదము, భావము వంటి పదాల్లో మహాప్రాణాక్షరాలను స్పష్టంగా వినిపించేలా పలకాలి.

  • మాడ్యులేషన్:
    • పాటలోని భావానికి తగినట్టు మృదువుగానో, గంభీరంగానో పాడాలి.
      • ఉదా: జయజయజయ ప్రియభారత: ఇందులో "జయదిశాంత గత శకుంత దివ్యగాన పారితోషణ" అనే వాక్యంలో "జయదిశాంత గత శకుంత" వరకు గంభీరంగా పాడి, "దివ్యగాన పారితోషణ" అనేది మృదువుగా పాడితే బాగుంటుంది.
      • ఉదా: వందేమాతరం: ఇందులో "శుభ్రజ్యోత్స్నా పులకిత యామినీం ఫుల్లకుసుమిత ధ్రుమదళ శోభినీంఅనే వాక్యాన్ని గంభీరంగా పాడి, "సుహాసినీం సుమధుర భాషిణీం" అనేది మృదువుగా పాడితే బాగుంటుంది.
      • ఉదా: జనగణమన: ఇందులో "తవ శుభ నామే జాగే తవ శుభ ఆశిశ మాగేఅనే వాక్యాన్ని కోమలంగా పాడి, "గాహే తవ జయగాధా" అనేది గంభీరంగా పాడితే బాగుంటుంది.

  • Timber (Tonal quality):
    • సహజంగా ప్రతి ఒక్కరికి అబ్బే గాత్రశైలి ఇది.
    • గాయకులందరూ అన్ని రకాల గీతాలను పాడగలిగేలా కృషి చేయాలి. అందుకోసం:
      • గొంతును బాగా తెరిచి పాడాలి. భావాన్ని పలికించటానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది.
      • పాట పెదవినుంచే కాదు, మనసులోంచి, నాభిలోంచి రావాలి.
      • పళ్ళను నొక్కిపెట్టి పాడకూడదు.
      • ముక్కుతో పాడకూడదు.
      • పాటకి సరైన శృతిని ఎంచుకోవాలి.

  • No comments:

    Post a Comment