Lyrics: Sri Abburi Ramakrishna Rao
Music: Rajani
Raagam: Madhuvanthi
Thaalam: Trisra Eka
Pa) Yugayugaalugaa nanney koriyunde kaabolunu
Ney nadichey daari chentha nilichiyundeno emo
1) Enaado sandhya vela - masaka masaka veluthurulo
Kanugonala nenaathani kaanchiyuntinanipinchunu
2) Velugu jilugu paatalatho - Nedey jaabili nivaali
Veedipovu neeli musugu - nisaamukhamu nundi vraali
Vennela velugulanaathadu - kannuleduta kanipinchaga
Theralannee chitikelona - surigi maayamaipovunu
ప) యుగయుగాలుగా నన్నే కోరియుండె కాబోలును
నే నడిచే దారిచెంత నిలిచియుండెనో ఏమో
1) ఏనాడో సంధ్యవేళ - మసక మసక వెలుతురులో
కనుగోనల నేనాతని కాంచియుంటిననిపించును
2) వెలుగు జిలుగు పాటలతో - నేడే జాబిలి నివాళీ
వీడిపోవు నీలి ముసుగు - నిశాముఖమునుండి వ్రాలి
వెన్నెల వెలుగులనాతడు - కన్నులెదుట కనిపించగ
తెరలన్నీ చిటికెలోన - సురిగి మాయమైపోవును
No comments:
Post a Comment