Raagam: Thilang
Thaalam: Aadi
Lyrics: Sri Balantrapu Rajanikantha Rao
రచన / సంగీతం - బాలాంత్రపు రజనీకాంత రావు
ప) స్వతంత్ర భారత జనని నీకిదె
నితాంత నవ నీరాజనము
అశేష పూజా శిరీషములతో
అగణిత నర నారీ జనము
1) వదలెను చిర దాస్య శృంఖలమ్ములుచెదరెను దైన్యతమః పటలమ్ములు
ఆసేతు హిమనగమ్మొక పొంగై
అలముకొన్నదానన్ద తరంగము
2) పచ్చని తోటల ఏ ఎడ వినినా
స్వేచ్ఛా పికములు నిండు గళమ్ముల
హాయి హాయిగా రెక్కల విద్రిచే
తీయనిగీతి హారతులే
3) త్యాగమూర్తియౌ మహాత్ముడొసగిన
శాంత్యహింసలె సదాశయములుగ
సకల వసుంధరనేకము సేయగ
అకళంకులమై ప్రతినలు సేతుము
Pa) Swathanthra Bharatha janani neekidey
Nithaantha nava neeraajanamu
Asesha poojaa sireeshamulatho
Aganitha nara naaree janamu
1) Vadalenu chira daasya srunkhalammulu
chedarenu dainyathamah patalammulu
Aasethu Hima nagammoka pongai
Alamukonnadaananda tharangamu
2) Pacchani thotala e eda vininaa
svecchaa pikamulu nindu galammula
haayi haayigaa rekkala vidrichey
theeyani geethi haarathuley
3) Thyaagamoorthiyou mahaathmudosagina
saanthyahimsaley sadaasayamuluga
Sakala vasundharanekamu seyaga
Akalankulamai prathinalu sethumu
No comments:
Post a Comment