Pa) Entha chakkanidoyi ee Telugu thota
Entha parimalamoyi ee thota poolu
1) E nandanamu nundi ee naaru thecchiro
E swarnadeejalamulee madulaketthiro
Intha vinthala jaathulee thotalo perugu
Ee thota epulo intha navakamu viriya
2) E amrutha hasthaala e suralu saakiro
E accharala muruvulee theeru diddeno
Ee poola paalalo entha theeyandanamu
Ee lathala pokillakentha vayyaarammu
3) Javaraali valapuvale ravibimba deepthivale
Hima navonnathi vole Rushi vaakku mahima vale
Naayadandanu repu ee Telugu thotalo
Paadukonanindoyi pallavimpanindoyi
ప) ఎంత చక్కనిదోయి ఈ తెలుగు తోటలో
ఎంత పరిమళమోయి ఈ తోట పూలు
1) ఏ నందనము నుండి ఈ నారు తెచ్చిరో
ఏ స్వర్ణదీజలములీ మడులకెత్తిరో
ఇంత వింతల జాతులీ తోటలో పెరుగు
ఈ తోట ఏపులో ఇంత నవకము విరియ
2) ఏ అమృత హస్తాల ఏ సురలు సాకిరో
ఏ అచ్చరల మురువులీ తీరు దిద్దెనో
ఈ పూల పాలలో ఎంత తీయందనము
ఈ లతల పోకిళ్ళకెంత వయ్యారమ్ము
3) జవరాలి వలపువలె రవిబింబ దీప్తివలె
హిమ నవోన్నతి వోలె ఋషి వాక్కు మహిమ వలె
నాయడందను రేపు ఈ తెలుగు తోటలో
పాడుకొననిండోయి పల్లవింపనిండోయి
No comments:
Post a Comment