ప) ఓ భారత నారీ
భవితకు బంగరు బాటలు వేయగ - పరాకు వదలి బిరాన కదలి
జగాన ముందుకు సాగిపో - గతాన్ని తెలుసుకు మసలుకో
1) మగువ మాంచాల తెగువ ఏమాయే
సుదతి చానమ్మ సుద్దులేమాయే
సత్యవై సీతవై ఆదుకోలేవా
విధర్మ విషాగ్ని కీలలన్నణచి
స్వధర్మ సుధలే కురియగ లేవో - కురియగ రావో
2) ధన మాన ప్రాణములు దోచు దుండగులు
దండిగా దొరలైరి దండనే లేక
దుర్గవై ఝాన్సీవై వారినెదిరించి
పరమ పావని గంగా మాతవై
ప్రవహించి పూనీతల చేయగ లేవో - చేయగ రావో
Pa) O Bhaaratha naari
Bhavithaku bangaru baatalu veyaga - paraaku vadali biraana kadali
jagaana munduku saagipo - gathaanni thelusuku masaluko
1) Maguva Maanchaala theguva emaayey
Sudathi Chaanamma suddulemaayey
Sathyavai Seethavai aadukolevaa
vidharma vishaagni keelalannanachi
swadharma sudhaley kuriyagalevo - kuriyaga raavo
2) Dhana maana praanamulu dochu dundagulu
dandigaa doralairi dandaney leka
Durgavai Jhansivai vaarinedirinchi
Parama Pavani Gangaa maathavai
pravahinchi puneethala cheyaga levo - cheyaga raavo
No comments:
Post a Comment