Pa) Suvvi suvvi suvvi suvvani sudathulu danchedarolaala
sudathulu danchedarolaala
Aahummmm suvvi suvvi suvvi
1) Vanithalu manasulu kundena chesitu
valapulu thaganincholaala - Aha valapulu thaganincholaala
Kanuchoopulanidu rokandlanu
kannelu danchedarolaala - Aha kannelu danchedarolaala
2) Bangaru cheragulu pattu puttamulu
kongulu thoolaganolaala - Aha kongulu thoolaganolaala
Anganalandaru athi vedukatho
pasupunu danchedarolaala - Aha pasupunu danchedarolaala
3) Ghallughallumanu kankana ravamulu
Pallava paanulakolaala
Allana nadumanu asiyaadu sathulu
ollana danchedarolaala - Aha ollana danchedarolaala
Suvvi suvvi Ramachandra
Suvvi suvvi Keerthi saandra
Suvvi Seethamma maaku
Subhamulimmaa
ప) సువ్వి సువ్వి సువ్వి సువ్వని సుదతులు దంచెదరోలాల
సుదతులు దంచెదరోలాల
ఆ సువ్వి సువ్వి సువ్వి - ఆ సువ్వి సువ్వి
1) వనితలు మనసులు కుందెన చేసిటు
వలపులు తగనించోలాల
కనుచూపులనిడు రోకండ్లను
కన్నెలు దంచెదరోలాల - కన్నెలు దంచెదరోలాల
2) బంగరు చెరగులు పట్టు పుట్టములు
కొంగులు తూలగనోలాల - అహ కొంగులు తూలగనోలాల
అంగనలందరు అతి వేడుకతో
పసుపును దంచెదరోలాల - అహ పసుపును దంచెదరోలాల
3) ఘల్లుఘల్లుమను కంకణ రవములు
పల్లవ పాణులకోలాల
అల్లన నడుమను అసియాడు సతులు
ఒల్లన దంచెదరోలాల - అహ ఒల్లన దంచెదరోలాల
సువ్వి సువ్వి రామచంద్ర - సువ్వి సువ్వి కీర్తి సాంద్ర
సువ్వి సీతమ్మ మాకు శుభములిమ్మా
No comments:
Post a Comment