- లలితసంగీతంలో వాద్యసహకారం చేసేది:
- శృతి, లయ ఆధారాన్ని అందించటం
- గీతానికి తగ్గ రసపోషణకు దోహదం చేయటం
- గాయకునికి కాస్త విరామాన్ని అందించటం
- పాటయొక్క ఇతివృత్తానికి, భావానికి, రసానికి మరింత అందాన్ని అందించటం
- వాయిద్యములలో రకములు:
- సుషిరములు: బెజ్జము గల వాయిద్యములు (వేణువు, క్లారినెట్, మొ||)
- తతములు: తంత్రీవాద్యములు (వీణ, సితార్, వయోలిన్, మొ||)
- ఘనములు: లోహ వాద్యములు (మంజీర, జైలోఫోన్, మొ||)
- అవనత్థములు: చర్మ వాద్యములు (మృదంగం, తబలా, మొ||)
- విద్యుత్ పరికరములు (కీబోర్డ్, సింథసైజర్, మొ||)
- ఈ వాయిద్యాలను ఏ పద్ధతిలో మేళవించాలి అనే విషయంలో వారివారి మేధస్సు, ఆలోచనాసరళి, కాల్పనిక శక్తులను బట్టి ఒకొక్కరికి ఒకొక్క శైలి ఉంటుంది.
లక్షణ గీతం
ప) సుందరమౌ గీతానికి అందమైన ఆభరణం
సరిజోడుగ సమకూరే వాద్య సమ్మేళనం
చ1) సుషిరములు తతములు ఘన అవనత్థములు
అధునాతన విద్యుచ్చాలితమౌ ధ్వని పరికరములు
సుషమ సురుచిర స్వనముల విరియించే వాద్యములు
మేళవించు విధములు మేధకు తగు పథములు
చ2) ఔన్నత్యమే ఆశయమై ఔచిత్యమే అవశ్యమై
శోభిల్లిగ రూపొందే వాద్యసంగీతం
సన్నివేశ సందర్భములితివృత్తములు
సరితూగే పదసంపద ఆధారమై
అనువైన స్వరలహరుల అలరారే గీతం - ఆ
గీత వాద్యముల కలయిక
పూవు తావి పోలిక - ఆ
మేళనం రససిద్ధికి సోపానం - చిత్త
రంజనం ఆ స్వర పద మధుపానం
వినేవారిని ఒక గీతం రంజింపజేయాలంటే, వాద్య సహకారానికి ఉండవలసిన లక్షణాలు:
- ఉన్నతంగా ఉండాలి
- ఔచిత్యాన్ని పాటించాలి
- రసపోషణకు అనుగుణంగా ఉండాలి
- వివిధ సందర్భాలకు, సన్నివేశాలకు, ఇతివృత్తాలకు సరితూగే పదజాలానికి అనుగుణమైన స్వరాలతో, బాణీతో ఉండాలి
No comments:
Post a Comment