Music: Sri Palagummi Viswanatham
Raagam: Sankarabharanam-based
Thaalam: Aadi
Pa) Kadali neeru kadupu nindaa thaagi vacchenu
Mabbu dandu vacchenu
Mabbu choosi dubbu nariki ollu vanchenu
Raithu mallu chesenu
1) Konda meeda kundapotha vaana kurisenu
Eru thaanamaadenu
Eru choosi kodegittha ranke vesenu
Raithu gunde pandenu
2) Gattu nariki putta nariki chadunu chesenu
polamu chadunu chesenu
Gallu lepi mallu loki neellu pettenu
raithu thallu pettenu
3) Neeru petti naaru naati gattulekkagaa
Kaalamittey gadichenu
Pacchamokka perigi perigi pandi origenu
Pasidi panta vacchenu
4) Kotha kosi kuppa vesi noorchi thecchenu
Raithu gaade nimpenu
Paadipanta koduva leka pillapaapalu
sadaa challangunduru
ప) కడలినీరు కడుపునిండా తాగివచ్చేను - మబ్బు దండు వచ్చేను
మబ్బు చూసి దుబ్బు నరికి ఒళ్ళు వంచేను - రైతు మళ్ళు చేసేను
1) కొండమీద కుండపోత వాన కురిసేను - ఏరు తానమాడేను
ఏరు చూసి కోడెగిత్త రంకె వేసేను - రైతు గుండె పండెను
2) గట్టు నరికి పుట్ట నరికి చదును చేసేను - పొలము చదును చేసేను
గళ్ళు లేపి మళ్ళు లోకి నీళ్ళు పెట్టేను - రైతు తళ్ళు పెట్టేను
3) నీరుపెట్టి నారు నాటి గట్టులెక్కగా - కాలమిట్టే గడిచేను
పచ్చమొక్క పెరిగి పెరిగి పండి ఒరిగేను - పసిడి పంట వచ్చేను
4) కోత కోసి కుప్ప వేసి నూర్చితెచ్చేను - రైతు గాదె నింపేను
పాడిపంట కొదువ లేక పిల్లపాపలు - సదా చల్లంగుందురు
 
 
No comments:
Post a Comment