Lyrics: Smt. Sarada Ashokvardhan
Music: Sri L. Nirmal Kumar
Raagam: Mayamalavagowla
Thaalam: Aadi
Pa) Moyyara moyyara baruvulu - aha
veyyara veyyara adugulu
Ee ooruvaada nee melu chooda
Nee thodugoodi ika nadiche
1) Mattini nammina manishini nenani
gattiga chepparaa naagali pattaraa
Bhoomi thalli maa ilavelupani
Aa thalli deeveney anthulenidani - amithamainadani thelupu
Aa amma needalo chaluva medalo - lotu leka ika brathakaraa
2) Manthramu kaadidi - thanthramu kaadidi
yanthra yugamani chaati chepparaa
karmaagaaramey devaalayamani
Sutthi pattinaa ukku muttinaa - kaarmikudey mana devudani
Adi thelusukuntey - atu naduchukuntey
ninu manachukuntey soubhaagyamuraa
ప) మొయ్యర మొయ్యర బరువులు - అహ
వెయ్యర వెయ్యర అడుగులు
ఈ ఊరువాడ నీ మేలు చూడ
నీ తోడుగూడి ఇక నడిచె
1) మట్టిని నమ్మిన మనిషిని నేనని
గట్టిగ చెప్పరా నాగలి పట్టరా
భూమితల్లి మా ఇలవేలుపని
ఆ తల్లి దీవెనే అంతులేనిదని - అమితమైనదని తెలుపు
ఆ అమ్మ నీడలో చలువమేడలో - లోటులేక ఇక బ్రతకరా
2) మంత్రము కాదిది - తంత్రము కాదిది
యంత్ర యుగమని చాటి చెప్పరా
కర్మాగారమే దేవాలయమని
సుత్తిబట్టినా ఉక్కుముట్టినా - కార్మికుడే మన దేవుడని
అది తెలుసుకుంటే - అటు నడుచుకుంటే
నిను మలచుకుంటే సౌభాగ్యమురా
 
 
No comments:
Post a Comment