Monday, 31 August 2026

Edukondala paiki ekkaali - Devotional song - Kopalle Sivaram

Lyrics: Sri Kopalle Sivaram
Music: L. Nirmal Kumar

Raagam: Misrama Kambhoji
Thaalam: Trisra Eka

Pa) Edu kondala paiki ekkaali
Enkanna paadaalu mokkaali
Govinda naamaalu palakaali - maa
pilupulo aa saami kulakaali

Govinda Govinda Venkata Ramana Govinda
Edu kondala Venkata Ramana Govinda Govinda

1) O... Ee dooravaasulu nee charana daasulu
Idaleru nee vaddi kaasulu
Ninu thalachina chaalu pongey hrudayaalu
Nee poojaku virisey kusumaalu..aa..
Sridevi valaputho Alamelu alakatho
Bandhinchey sarasaala vela
Darsinchi thariyincha raavaali
Ee hrudaya kusumaalu thevaali
Govinda naamaalu palakaali - maa
pilupulo aa saami kulakaali

2) O... Padavula raajillu navvula harivillu
Deenulapai deevenaley jallu
Nee challani kallu vennela podarillu
Nee choopey daya choopey illu..aa..
Ninu cheralemu ninu veedalemu
Maa manasey kovela chesemu
Aa konda digi nuvvu raavaali
Gundello kaapuramu cheyaali
Govinda naamaalu palakaali - maa
pilupulo aa saami kulakaali


ప) ఏడు కొండలపైకి ఎక్కాలి
ఎంకన్న పాదాలు మొక్కాలి
గోవింద నామాలు పలకాలి - మా
పిలుపులో ఆ సామి కులకాలి 

గోవింద గోవింద వెంకటరమణ గోవింద
ఏడుకొండల వెంకటరమణ గోవింద గోవింద

1) ఓ... ఈ దూరవాసులు నీ చరణదాసులు 
ఇడలేరు నీ వడ్డికాసులు 
నిను తలచిన చాలు పొంగే హృదయాలు 
నీ పూజకు విరిసే కుసుమాలు ..ఆ..
శ్రీదేవి వలపుతో అలమేలు అలకతో 
బంధించే సరసాల వేళ 
దర్శించి తరియించ రావాలి 
ఈ హృదయకుసుమాలు తేవాలి 
గోవింద నామాలు పలకాలి - మా 
పిలుపులో ఆ సామి కులకాలి

2) ఓ ... పదవుల రాజిల్లు నవ్వుల హరివిల్లు 
దీనులపై దీవెనలే జల్లు 
నీ చల్లని కళ్ళు వెన్నెల పొదరిల్లు 
నీ చూపే దయ చూపే ఇళ్ళు ..ఆ..
నిను చేరలేము నిను వీడలేము 
మా మనసే కోవెల చేసేము 
ఆ కొండ దిగి నువ్వు రావాలి 
గుండెల్లో కాపురము చేయాలి
గోవింద నామాలు పలకాలి - మా 
పిలుపులో ఆ సామి కులకాలి 

No comments:

Post a Comment