Monday, 26 October 2026

Anthey Chaalu Naaku - Folk Song - Light Music Song

Lyrics: Unknown

Music: Unknown

Raagam:

Thaalam: Eka


Pa) (Baavaa!) Anthey naaku chaalu - thamalapaaku thodime padivelu

Veredinka koredika ledu - Andarivole adigedaanni kaanu

kondarivole kosaredaanni kaanu (Baavaa!)


1) Mukkuku mukkera leka mukku chinnaboyinadi

Mugguru thammullanammi mukkuku mukkera theraa (Muddula baavaa!)


2) Naduma vaddaanam leka nadumu chinnaboyinadi

Naluguru chellellanammi nadumuku vaddaanam theraa (baavaa!)


3) Kaallaku kadiyaalleka kaallu chinnaboyinayi

Kaadi eddunammukoni kaallaku kadiyaalu theraa (baavaa!)


4) Chethiki chendi leka cheyi chinnaboyinadi

chemalanadiri pantanammi chethiki chendeelu theraa (baavaa!)


5) Patte mancham parupu leka manasu chinnaboyinayi

Panta bhoomulammukoni patte mancham parupu theraa (baavaa!)


ప) (బావా!) అంతే నాకు చాలు - తమ్మలపాకు తొడిమే పదివేలు

వేరేదింక కోరేదిక లేదు - అందరివోలె అడిగేదాన్ని కాను

కొందరివోలె కొసరేదాన్ని కాను


1) ముక్కుకు ముక్కెర లేక ముక్కు చిన్నబోయినది

ముగ్గురు తమ్ముళ్ళనమ్మి ముక్కుకు ముక్కెర తేరా (ముద్దుల బావా!)


2) నడుమ వడ్డాణం లేక నడుము చిన్నబోయినది

నలుగురు చెల్లెళ్ళనమ్మి నడుముకు వడ్డాణం తేరా (బావా!)


3) కాళ్ళకు కడియాల్లేక కాళ్ళు చిన్నబోయినాయి

కాడి ఎద్దునమ్ముకొని కాళ్ళకు కడియాలు తేరా (బావా!)


4) చేతికి చెండీ లేక చేయి చిన్నబోయినది

చేమలనదిరి పంటనమ్మి చేతికి చెండీలు తేరా (బావా!)


5) పట్టెమంచం పరుపు లేక మనసు చిన్నబోయినది

పంటభూములమ్ముకొని పట్టెమంచం పరుపు తేరా (బావా!)



No comments:

Post a Comment