Lyrics: Smt. Jonnavada Raghavamma
Music: Dr. M. Chittharanjan
Raagam: Ragamalika (Bilahari, Hamsadhwani, Saramathi)
Thaalam: Misrachaapu
Bilahari
Pa) Evaru penchina kalpatharulivi - Evaru theerchina soyagamulivi
Echata choosinaa oohakandani andamey kanuvindu chesenu
1) Surabhi chandana tharula sanduna - viriyaboosina kaluva kolanulu
Suralakiravagu girulapai - aa marakathammula mandirammulu
Hamsadhwani
2) Aakasammuna alibilligaa - aliki chukkalu diddirevvaru
Andamagu aa chandamaamanu - kandukamu vale kadipirevvaru
Saaramathi
3) Pasidi kondala sikharamulapai - paruvuletthedi aruna rekhalu
prakruthi maatha paita chenguna - paravasinchedi ee jagammulu
బిలహరి
ప) ఎవరు పెంచిన కల్పతరులివి - ఎవరు తీర్చిన సోయగములివి
ఎచట చూసినా ఊహకందని అందమే కనువిందు చేసెను
1) సురభి చందన తరుల సందున - విరియబూసిన కలువ కొలనులు
సురలకిరవగు గిరులపై - ఆ మరకతమ్ముల మందిరమ్ములు
హంసధ్వని
2) ఆకసమ్మున అల్లిబిల్లిగా - అలికి చుక్కలు దిద్దిరెవ్వరు
అందమగు ఆ చందమామను - కందుకమువలె కదిపిరెవ్వరు
సారమతి
3) పసిడి కొండల శిఖరములపై - పరువులెత్తెడి అరుణరేఖలు
ప్రకృతిమాత పైట చెంగున - పరవశించెడి ఈ జగమ్ములు
No comments:
Post a Comment