Friday, 17 February 2023

Saranu saranu saranu Sankara - Sri Goparaju Venkata Subbarao



Thaalam: Trisra gathi Aadi Thaalam


Pa) Saranu saranu saranu Sankara Kailaasa vaasa

Saranu saranu saranu Sankara


Anu) Saranu jocchithinanuchununti - Charanamulanu pattukonti

Karamuletthi mrokkuchunti - Hara jaya bahuparaak anti


1) Harudaveevu gurudaveevu - varudaveevu sthirudaveevu

Parama dayaakarudaveevu - Parama mangalapradudaveevu


2) Thirigi thirigi thimmaletthi - marala marala buradalona

porali porali thudaku guruni - karuna vadasi ninu cherithi


3) Thananu thaanu thelusukonaka ninunerunganetula galgu

Thanalo ninu neelo thanu - kaneduvaadey ghana budhundu


4) Varada Mahaadeva Sankara - paramu sukhamu swaswaroopamu

Marugu padaka undajeyumu - Biriyajeyumu maayaajaalamu



ప) శరణు శరణు శరణు శంకర కైలాసవాస

శరణు శరణు శరణు శంకర


అను) శరణుజొచ్చితిననుచునుంటి - చరణములను పట్టుకొంటి

కరములెత్తి మ్రొక్కుచుంటి - హర జయ బహుపరాకంటి


1) హరుడవీవు గురుడవీవు - వరుడవీవు స్థిరుడవీవు

పరమదయాకరుడవీవు - పరమ మంగళప్రదుడవీవు


2) తిరిగి తిరిగి తిమ్మలెత్తి - మరల మరల బురదలోన

పొరలి పొరలి తుదకు గురుని - కరుణ వడసి నిను చేరితి


3) తనను తాను తెలుసుకొనక నినునెరుంగనెటులగల్గు

తనలో నిను నీలో తను - కనెడువాడే ఘనబుధుండు


4) వరద మహాదేవ శంకర - పరము సుఖము స్వస్వరూపము

మరుగుపడక ఉండజేయుము - బిరియజేయుము మాయాజాలము



No comments:

Post a Comment