Lyrics: Smt. M. Manikyamba
Music: Smt. Chaturvedula Shobha
Raagam: Aananda Bhairavi
Thaalam: Eka
Pa) Viduvabomu kottha pellikoothuraa
Thalupu theeyabomu neeku
Siggupadakey Seethamma
Mettininti peru cheppu
Varinchina vibhuni peru cheppu
Varinchina vibhudevaro cheppu
1) Thaatakini vadhinchina
ghanudey naa vibhudu
Daari vadalarey inthulaaraa
2) Sivuni villu ekkupetti
Nanu chepattina dheerudey
Daari vadalarey inthulaaraa
3) Sree Ramachandrudey
Nanu chepattagaa
Thana venta kadilocchinaaney
Musi musi navvulela
Mucchatagaa mummaaru cheppu
Nee nota mani maanikyaalu raalavey
Kudi kaalu mundu petti
raavamma maa inti Mahalakshmiki
Pa) విడువబోము కొత్త పెళ్ళికూతురా - తలుపు తీయబోము నీకు
సిగ్గుపడకే సీతమ్మా - మెట్టినింటి పేరు చెప్పు
వరించిన విభుని పేరు చెప్పు - వరించిన విభుడెవరో చెప్పు
1) తాటకిని వధించిన ఘనుడే నా విభుడు
దారి వదలరే ఇంతులారా
2) శివుని విల్లు ఎక్కుపెట్టి నను చేపట్టిన ధీరుడే
దారి వదలరే ఇంతులారా
3) శ్రీ రామచంద్రుడే నను చేపట్టాగ
తన వెంట కదిలొచ్చినానే
ముసి ముసి నవ్వులేల
ముచ్చటగా ముమ్మారు చెప్పు
నీ నోట మణి మాణిక్యాలు రాలవే
కుడి కాలు ముందు పెట్టి
రావమ్మా మా ఇంటి మహాలక్ష్మి
No comments:
Post a Comment