- పైడాల గురుమూర్తిశాస్త్రి 18వ శతాబ్దమునకు చెందినవాడు. నివాసము తిరునల్వేలి జిల్లా కయత్తారు అను గ్రామము.
- రామస్వామి దీక్షితులకు సమకాలీకుడు.
- తెలుగు ములికినాటి బ్రాహ్మణుడు.
- చతుశ్శాస్త్ర పండితుడు. సంగీతసాహిత్యములందు అతిసమర్థుడు.
- గీత, లక్షణగీత, ప్రబంధ, కీర్తనలు అనేకము రచించిన మహానుభావుడు.
- సుమారు వెయ్యి గీతములవరకు రచించియుండుటచే ఈయనకు “వేయి గీత” అను సార్థకనామము వచ్చినది.
- తన రచనలయందు గురుమూర్తి అను స్వనామ ముద్రను ఉపయోగించినాడు.
- తనకుగల సంగీత సాహిత్య విశిష్టతచే మణలి చిన్నయ మొదలియార్ చే మద్రాసునందు బహు సన్మానములొందినారు.
- సంస్కృతములో ఈయన రచించిన
ధన్యాసిరాగములోని “నీరజనయన”
మోహనరాగములోని “సదాపతిం” వంటి కీర్తనలు,
శహన రాగములోని “కంసాసుర” వంటి లక్షణగీతములు
మిగుల ప్రసిద్ధములు.
No comments:
Post a Comment