- ఇతడు 18-19 శతాబ్దాలకు చెందినవాడు.త్యాగరాజుకు ముఖ్యశిష్యుడు. తమిళబ్రాహ్మణుడు.
- మద్రాసులోని తిరువత్తియూర్ నందు జన్మించుటచే “తిరువత్తియూర్ త్యాగయ్య” అని పిలువబడును.
- ఇతడు ఘనరాగపంచకము మొదలైన 108 రాగములలో అతిభక్తిపూరితమైన కీర్తనలు రాసి, “సంకీర్తన రత్నావళి” అను గ్రంథమును రచించిన ప్రతిభావంతుడు. ఈ గ్రంథమును ఇతడు వేణుగోపాలస్వామికి అంకితమిచ్చిరి.
- శ్రీత్యాగరాజుపై భక్తితో ఖరహరప్రియ రాగములో “త్యాగరాజ సద్గురుని తలతును ప్రేమతో” అను కీర్తనను రచించిరి.
- కాంభోజిరాగములోని “సరసిజనాభ” అను అటతాళ వర్ణములో ముక్తాయిస్వరము 3 ఆవృత్తములలో ఉన్నవని విద్వాంసులు ఆక్షేపింతురని తలచి, దానిని పూర్తిచేయుటకు దక్షిణదేశమంతటా అనేకమంది ప్రయత్నించగా, చివరకు ఈయనయే దానిని పూర్తిచేసి, స్వరసింహుడని బిరుదుపొంది, “స్వరసింహ త్యాగయ్యర్” అని పిలువబడిరి.
- నెల్లూరు రాఘవరాజుగారు, గుంటూరు వాస్తవ్యులైన శంకరయ్యశాస్త్రిగారు ఈయన శిష్యులు.
- 1900 సంవత్సరంలో తమ తండ్రిగారైన కుప్పయ్యర్ గారి రచనలన్నింటిని చేర్చి, “పల్లవి స్వరకల్పవల్లి” అను పేరిట అచ్చొత్తించినారు. ఇది సంగీత ప్రపంచమునకు అఖండమైన సేవ.
- వీరు తమ రచనలను సంకీర్తన రత్నావళిలో ముద్రించియున్నారు. వీరి ముద్ర “గోపాలదేవ” అనునది.
Carnatic Music, the classical music form of South India, has originated from Saama Vedam. It is acclaimed to have soothing effect on not only humans but also animals. "Sisurvetthi Pasurvetthi Vetthi Gaanarasam Phanih". This website is maintained by a music school 'Sriman Sangeetha Nilayam', named after Sri Bharatam Srimannarayana, a famous multifaceted scholar from Tadepalligudem, AP. Story behind the emblem of SSN... https://www.youtube.com/watch?v=tdWGZJibzZU&t=95s
Monday, 18 May 2026
Life History of Sri Tiruvotriyoor Thyagaiyer - జీవితచరిత్ర - తిరువత్తియూర్ త్యాగయ్యర్
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment