Raagam: Kharaharapriya
Thaalam: Aadi
Okaparikokapari vayyaaramai
Mokamuna kalalella molachinatlundey
1) Jagadeka pathimena challina karpoora dhooli
Jigigoni naluvanka chindagaanu
Mogi chandramukhi uramuna nilipe gaana
pogaru vennela digabosinatlundey
2) Meraya Sri Venkatesu mena singaaramugaanu
tharachaina sommulu dhariyinchagaa
Merugu bodi Alamelu Mangayu thaanu
merupu meghamu koodi merasinattundey
ప) ఒకపరికొకపరి ఒయ్యారమై
మొకమున కళలెల్ల మొలచినట్లుండె
1) జగదేక పతిమేన చల్లిన కర్పూర ధూళి
జిగిగొని నలువంక చిందగాను
మొగి చంద్రముఖి ఉరమున నిలిపె గాన
పొగరు వెన్నెల దిగబోసినట్లుండె
2) మెరయు శ్రీవేంకటేశు మేన సింగారముగాను
తరచైన సొమ్ములు ధరియించగా
మెరుగు బోడి అలమేలు మంగయు తాను
మెరుపు మేఘము గూడి మెరసినట్టుండె
No comments:
Post a Comment