ఇతడు 18-19 శతాబ్దములకు చెందినవారు. త్యాగరాజుకు ముఖ్యశిష్యుడు. తమిళబ్రాహ్మణుడు.
మద్రాసులోని తిరువత్తియూర్ నందు జన్మించెను. కనుక “తిరువత్తియూర్ కుప్పయ్యార్” అని పిలువబడును.
నారాయణగౌళ రాగాలాపనలో విశేష ప్రతిభగలవాడగుటచే, “నారాయణగౌళ కుప్పయ్యర్” అనియు, “పాట కుప్పయ్యర్” అనియు చెప్పుకొనెడివారు.
తండ్రిపేరు సాంబమూర్తిశాస్త్రి. ఈయన వీణ వాయిద్యములో అత్యద్బుతమైన ప్రతిభగలవాడగుటచే, “సాంబడు వాయించాలి, సాంబడే (ఈశ్వరుడే) వినాలి” అని ప్రజలు చెప్పుకొనేవారు.
కుప్పయ్యర్ సంగీతసాహిత్యములలో గొప్పపండితుడు కావున, కవియగును. ఇతడు రచించిన తానవర్ణములు, కృతులు, తిల్లానాలు విశేష ప్రచారములోకి వచ్చినవి.
ఇవి “గోపాలదాస” ముద్రను కలిగియుండును. ఇతనికి “గానచక్రవర్తి” అను ప్రసిద్ధ బిరుదు కలదు.
ఈయన శిష్యులలో పల్లవి సీతారామయ్య, ఫిడేల్ పొన్నుస్వామి మొదలగువారు ముఖ్యులు.
వీరు గొప్ప భక్తులు. వీరి కులదైవము శ్రీరాధారుక్మిణీసమేతుడైన శ్రీవేణుగోపాలస్వామి. ప్రతిదినము స్వామికి పూజలు చేయుటయు, సంవత్సరమునకు రెండుసార్లు ఉత్సవము జరుపుటయు వీని అలవాటు. ఉత్సవసమయమందు గొప్పగొప్ప విద్వాంసుల గానసభలు జరుగుచుండెడివి. ఈ కచేరీలు వినుటకు, పూజను చూచుటకు వేలాదిమంది జనులు వచ్చుచుండిరి.
అటువంటి సందర్భంలోనే శ్రీత్యాగరాజస్వామివారు ఒకసారి కుప్పయ్యగారి ఇంటినుండుట తటస్థించి, వేణుగోపాలస్వామివారి దివ్యవిగ్రహమునుగాంచి, తన్మయత్వమును పొంది, కేదారగౌళరాగంలో “వేణుగానలోలుని గన వేయికన్నులు కావలెనే” అను కృతిని పాడిరి.
కుప్పయ్యగారికి వేణుగోపాలునిమీద అమితభక్తి కలదు కనుక, “గోపాలదాస” అను ముద్ర తన రచనలలో వాడిరి.
వీరియొక్క కుమారుడు శ్రీ తిరువత్తియూర్ త్యాగయ్యగారు కూడా వాగ్గేయకారుడే.
వీణకుప్పయ్యర్ వర్ణములు, కృతులు, తిల్లానాలు రచించియున్నారు. వీరు తానవర్ణ రచనలలో చాలా నిపుణత కలవారు.
వీరు 1917 లో పరమపదించిరి.
Carnatic Music, the classical music form of South India, has originated from Saama Vedam. It is acclaimed to have soothing effect on not only humans but also animals. "Sisurvetthi Pasurvetthi Vetthi Gaanarasam Phanih". This website is maintained by a music school 'Sriman Sangeetha Nilayam', named after Sri Bharatam Srimannarayana, a famous multifaceted scholar from Tadepalligudem, AP. Story behind the emblem of SSN... https://www.youtube.com/watch?v=tdWGZJibzZU&t=95s
Monday, 18 May 2026
Life History of Sri Veena Kuppaiyer - జీవితచరిత్ర - వీణ కుప్పయ్యర్
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment